Bheemla Nayak : పవన్ కళ్యాణ్ చదివిస్తా అన్నారు : పవన్ కారవాన్ అసిస్టెంట్

పవన్ కళ్యాణ్ కారవాన్ అసిస్టెంట్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ''పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి షూటింగ్ కి వెళ్లినా ఇదే కారవాన్ ని వాడతారు. నేను పవన్ సార్ కారవాన్ కి అసిస్టెంట్ గా రెండు........

Bheemla Nayak : పవన్ కళ్యాణ్ చదివిస్తా అన్నారు : పవన్ కారవాన్ అసిస్టెంట్

Pawan Caravan

 

Pavan Kalyan :  పవన కళ్యాణ్ మంచితనం గురించి అందరికి తెలిసిందే. ఆయన చుట్టూ ఉన్నవాళ్ళతో పాటు అభిమానులు, జనాలు కూడా పవన్ మంచితనం గురించి మాట్లాడుకుంటారు. ఆయన చుట్టూ ఉన్నవాళ్ళని, తన దగ్గర పని చేసే వాళ్ళని తన సొంత మనుషులుగా చూసుకుంటారు పవన్ కళ్యాణ్. ఇవాళ సాయంత్రం పవన్, రానా కలిసి నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

హీరో, హీరోయిన్స్, చాలా మంది ఆర్టిస్టులు షూటింగ్ లేదా సినిమా సంబంధించిన పనులకి బయటి లొకేషన్స్ కి వెళితే కారవాన్ లోనే ఉంటారు. చాలా మంది స్టార్స్ కి సొంత కారవాన్ లు ఉన్నాయి. ఇవాళ ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ రానుండటంతో ఈవెంట్ జరిగే గ్రౌండ్ వద్ద పవన్ ఎప్పుడూ వాడే కారవాన్ ని ఉంచారు. ఈ సందర్భంగా 10 టీవీ ప్రతినిధి పవన్ కళ్యాణ్ కారవాన్ అసిస్టెంట్ తో మాట్లాడారు. పవన్ కారవాన్ అసిస్టెంట్ పవన్ కళ్యాణ్ గురించి, ఆయన వ్యక్తిత్వం, మంచితనం గురించి మాట్లాడారు.

Sarkaru Vaari Paata : ‘కళావతి’ పాటకి తమన్ స్టెప్పులు.. అదరగొట్టావంటూ మహేష్ అభిమానులు..

పవన్ కళ్యాణ్ కారవాన్ అసిస్టెంట్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ”పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి షూటింగ్ కి వెళ్లినా ఇదే కారవాన్ ని వాడతారు. నేను పవన్ సార్ కారవాన్ కి అసిస్టెంట్ గా రెండు సంవత్సరాలుగా చేస్తున్నాను. సర్ అందర్నీ బాగా పలకరిస్తారు. ఆయన స్టాఫ్ అందరితో మంచిగా ఉంటారు. పవన్ సర్ వచ్చేసరికి కారవాన్ అంతా రెడీగా ఉంచుతాము. రాము అని పిలిచి బాగా మాట్లాడతారు. నాది మహబూబ్ నగర్. నేను వచ్చిన కొత్తలో నన్ను చదివిస్తాను అన్నారు. కానీ నాకే ఇంట్రెస్ట్ లేక వద్దు అన్నాను. పవన్ సర్ అంత మంచివాళ్ళు. ఆయన మంచితనం చూసి ఆయనకి పెద్ద ఫ్యాన్ అయ్యాను. పవన్ సర్ కోసం ఇంకో చిన్న కారవాన్ కూడా రెడీ అవుతుంది” అని తెలిపారు.

Vikramaditya : పీరియాడిక్ సినిమా తెరకెక్కిస్తున్న డైరెక్టర్ తేజ

ఈ వీడియో చూసిన పవన్ అభిమానులు, నెటిజన్లు మరోసారి పవన్ మంచితనం గురించి తెలుసుకొని పవన్ కళ్యాణ్ ని అభినందిస్తున్నారు. ఆయన మంచితనం వల్లే ఆయనకీ ఇంతమంది అభిమానులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.