Godfather: ‘గాడ్‌ఫాదర్’కు దూరంగా పవన్ కళ్యాణ్.. కారణం ఇదే!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. దసరా కానుకగా ‘గాడ్‌ఫాదర్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయనుండటంతో, ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే ఈ వేడుకకు చీఫ్ గెస్టుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఆయన ఈ సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉండబోతున్నారు.

Godfather: ‘గాడ్‌ఫాదర్’కు దూరంగా పవన్ కళ్యాణ్.. కారణం ఇదే!

Pawan Kalyan To Stay Away From Godfather Promotions

Godfather: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో చిరు మరోసారి తనదైన స్వాగ్‌తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా ఔట్ అండ్ ఔట్ పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించగా, చిరు ఈ సినిమాలో సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.

Godfather: బాసులు వచ్చిండ్రే.. బేసులు పెంచుండ్రే.. అంటూ దద్దరిల్లించిన మెగాస్టార్స్!

కాగా, దసరా కానుకగా ‘గాడ్‌ఫాదర్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లను జోరుగా చేస్తున్నారు చిత్ర యూనిట్. అయితే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఎవరు వస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో తొలుత వినిపించిన పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావడం విశేషం. మెగాస్టార్ మూవీకి పవన్ గెస్ట్‌గా వస్తే, మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఖాయమని అందరూ భావించారు. అటు గాడ్‌ఫాదర్ టీమ్ కూడా ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పవన్‌ను తీసుకు రావాలని ప్రయత్నించింది.

Godfather: గాడ్‌ఫాదర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగేది అక్కడేనా..?

కానీ.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో ఆయన గాడ్‌ఫాదర్ చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోతున్నాడు. ఇటీవల ఆయన ఫారిన్ టూర్‌కు వెళ్లడంతో గాడ్‌ఫాదర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పవన్ అందుబాటులో ఉండటం లేదు. ఇక ఫారిన్ టూర్ ముగించుకుని పవన్ అక్టోబర్ రెండో వారంలో తిరిగి వస్తారు. ఈ లెక్కన గాడ్‌ఫాదర్ చిత్రానికి సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్‌లోనూ పవన్ పాల్గనరని తెలుస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 5న గాడ్‌ఫాదర్ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. మరి పవన్ దూరంగా ఉండటంతో గాడ్‌ఫాదర్ టీమ్ ఈ చిత్ర ప్రమోషన్స్‌కు ఎవరిని పట్టుకొస్తారా అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.