Prabhas: “కాంతారా” సినిమాపై ప్రభాస్ ప్రశంసల జల్లు..

కన్నడ చిత్రం “కాంతారా” కర్ణాటక బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంటుంది. ఇటీవల తమిళ స్టార్ హీరో ధనుష్, అలాగే టాలీవడ్ భల్లాలదేవుడు రానా తమ సోషల్ మీడియా వేదికగా కాంతారా సినిమాను, దర్శకనిర్మాతలను అభినందిస్తూ పోస్ట్ లు వేశారు. తాజాగా ఈ వరుసలోకి బాహుబలి ప్రభాస్..

Prabhas: “కాంతారా” సినిమాపై ప్రభాస్ ప్రశంసల జల్లు..

Prabhas Comments on Kannada Movie Kantara

Prabhas: కన్నడ చిత్రం “కాంతారా” కర్ణాటక బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంటుంది. కెజిఫ్ చిత్రాన్ని తెరకెక్కించిన ‘హోంబలే ఫిల్మ్స్’ ఈ సినిమాను నిర్మించగా, తెలుగు థియేట్రికల్ రైట్స్ అల్లు అరవింద్ దక్కించుకున్నాడు. నేడు విడుదలకు సిద్ధమైంది.

Kantara: KGF నిర్మాతల నుంచి మరో అద్భుతమైన మూవీ..

ఇక ఈ సినిమాని స్టార్ హీరోలు సైతం ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇటీవల తమిళ స్టార్ హీరో ధనుష్, అలాగే టాలీవడ్ భల్లాలదేవుడు రానా తమ సోషల్ మీడియా వేదికగా కాంతారా సినిమాను, దర్శకనిర్మాతలను అభినందిస్తూ పోస్ట్ లు వేశారు. తాజాగా ఈ వరుసలోకి బాహుబలి ప్రభాస్ కూడా చేరాడు. ఈ శుక్రవారం కాంతారా మూవీ చూసిన ప్రభాస్ తన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

“కాంతారా ఒక అద్భుతమైన మూవీ. మంచి కాన్సెప్ట్ తో, అదిరిపోయే క్లైమాక్స్ తో తెరకెక్కిన ఈ సినిమాను తప్పక చూడాలి. ఇప్పటికి నేను ఈ మూవీని రెండుసార్లు చూశాను” అంటూ సినిమా పోస్టర్ ను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కాగా ఈ సినిమా IMDb రేటింగ్స్ లో “RRR” “KGF” చిత్రాలను అధిగమించి 9.6 రేటింగ్ ను సొతం చేసుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)