Prabhas: కృష్ణంరాజు చివరి కోరికను తీర్చలేకపోయిన ప్రభాస్.. అది ఏమిటంటే?

రెబల్ స్టార్ కృష్ణంరాజు.. తెలుగులో '187'కు పైగా సినిమాలో నటించారు. కెరీర్ మొదటిలో ఎక్కువుగా ప్రతినాయకుడి పాత్రలు, సపోర్టింగ్ రోల్స్ చేసిన కృష్ణంరాజు, ఆ తరువాత కథానాయకుడిగా యాంటీహీరో ఛాయలు ఉన్న పాత్రలు చేస్తూ అభిమానుల చేత రెబల్ స్టార్ అనిపించుకున్నారు. కృష్ణంరాజు వారసుడిగా సినీ పరిశ్రమకు పరిచయమైన ప్రభాస్, కృష్ణంరాజు కోరిక తీర్చలేకపోయాడంటూ ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది..

Prabhas: కృష్ణంరాజు చివరి కోరికను తీర్చలేకపోయిన ప్రభాస్.. అది ఏమిటంటే?

Prabhas couldn't fulfill Krishna Raju's last wish

Prabhas: రెబల్ స్టార్ కృష్ణంరాజు.. తెలుగులో ‘187’కు పైగా సినిమాలో నటించారు. కెరీర్ మొదటిలో ఎక్కువుగా ప్రతినాయకుడి పాత్రలు, సపోర్టింగ్ రోల్స్ చేసిన కృష్ణంరాజు, ఆ తరువాత కథానాయకుడిగా యాంటీహీరో ఛాయలు ఉన్న పాత్రలు చేస్తూ అభిమానుల చేత రెబల్ స్టార్ అనిపించుకున్నారు. “గోపికృష్ణ మూవీస్” అనే నిర్మాణ సంస్థని ప్రారంభించి కొన్ని చిత్రాలు కూడా నిర్మించారు.

Rebel Star Krishnam Raju: కృష్ణంరాజు సినీ ప్రయాణం.. రెబల్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చింది?

కృష్ణంరాజు వారసుడిగా సినీ పరిశ్రమకు పరిచయమైన, ఆయన సోదరుడి కొడుకు.. ప్రభాస్ స్టార్ హీరోగా ఎదిగి యంగ్ రెబల్ స్టార్ అనిపించుకుంటున్నాడు. కృష్ణంరాజు, ప్రభాస్ లు కలిసి కొన్ని సినిమాల్లో నటించగా, ఆయన చివరిగా నటించిన చిత్రం కూడా ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యామ్. రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్, కృష్ణంరాజు కోరిక తీర్చలేకపోయాడంటూ ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది..

“ప్రభాస్ తొందరగా పెళ్లి చేసుకుని, ఒక బిడ్డని కంటే ఎత్తుకుని ఆడించాలని ఉంది” అంటూ కృష్ణంరాజు మాట్లాడిన ఎమోషనల్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆయన కోరిక తీరకుండానే వెళ్లిపోయారు అంటూ నెటిజన్లు వారి భావాలను వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి తెలుసుకున్న రెబల్ స్టార్ అభిమానులు, సినీ ప్రముఖులు చివరిసారిగా ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి వస్తున్నారు.