Rebel Star Krishnam Raju: కృష్ణంరాజు సినీ ప్రయాణం.. రెబల్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చింది?

అలనాటి దర్శకుడు 'కోటయ్య ప్రత్యగాత్మ' తెరకెక్కించిన చిలకా గోరింక సినిమాతో 1966లో కృష్ణంరాజు సినీరంగ ప్రవేశం చేశారు. రెండో సినిమాగా కృష్ణంరాజు ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రం 'శ్రీ కృష్ణావతారం'లో నటించాడు. 1968లో కృష్ణం రాజు సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన "నేనంటే నేనే" సినిమాలో విలన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత హీరోగా కృష్ణంరాజు...

Rebel Star Krishnam Raju: కృష్ణంరాజు సినీ ప్రయాణం.. రెబల్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చింది?

Why Krishnam Raju Called Rebel Star

Rebel Star Krishnam Raju: అలనాటి దర్శకుడు ‘కోటయ్య ప్రత్యగాత్మ’ తెరకెక్కించిన చిలకా గోరింక సినిమాతో 1966లో కృష్ణంరాజు సినీరంగ ప్రవేశం చేశారు. ఈ చిత్రం ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డును గెలుచుకుంది. రెండో సినిమాగా కృష్ణంరాజు ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రం ‘శ్రీ కృష్ణావతారం’లో నటించాడు. ఆ తరువాత కూడా ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావులతో అనేక చిత్రాల్లో నటించారు.

Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇకలేరు..

1968లో కృష్ణం రాజు సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన “నేనంటే నేనే” సినిమాలో విలన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత హీరోగా కృష్ణంరాజు జీవన తరంగాలు, కృష్ణవేణి, భక్త కన్నప్ప, అమర దీపం, సతీ సావిత్రి, మనఊరి పాండవులు వంటి కుటుంబ, భక్తిరస చిత్రాలలో నటిస్తూనే.. కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ, త్రిశూలం, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపరాయుడు, మరణ శాసనం, పల్నాటి పౌరుషం వంటి రెబల్లియన్ రోల్స్ చేసి ప్రేక్షకుల చేత రెబల్ స్టార్ అని పిలిపించుకున్నారు.

‘187’కు పైగా సినిమాలో నటించిన కృష్ణంరాజు 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకున్నారు.
ఇక కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా నడిచిన ఆయన పయనం నేటితో ముగిసిపోయింది. కృష్ణంరాజు మరణం సినీపరిశ్రమకి తీరనిలోటు. ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.