Hanu-man Teaser: హనుమాన్ టీజర్ అప్డేట్ వచ్చేది ఆరోజే!

టాలీవుడ్‌లో ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్‌గా నిలుస్తూ, వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ డైరెక్టర్ ప్రస్తుతం ఓ ఫాంటసీ సూపర్ హీరో మూవీని తెరకెక్కిస్తున్నాడు. ‘హనుమాన్’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్ర టీజర్‌కు సంబంధించి దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజా అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

Hanu-man Teaser: హనుమాన్ టీజర్ అప్డేట్ వచ్చేది ఆరోజే!

Prashant Varma To Give Update On Hanu-man Teaser

Hanu-man Teaser: టాలీవుడ్‌లో ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్‌గా నిలుస్తూ, వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆయన తెరకెక్కించిన అ!, కల్కి, జాంబిరెడ్డి సినిమాలు ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాయి. ఇక ఈ డైరెక్టర్ ప్రస్తుతం ఓ ఫాంటసీ సూపర్ హీరో మూవీని తెరకెక్కిస్తున్నాడు. ‘హనుమాన్’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Hanu-Man : ‘అంజనాద్రి’ ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ‘హనుమంతు’..

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. తొలి పాన్ ఇండియా సూపర్ హీరో మూవీగా రాబోతున్న ‘హనుమాన్’ సినిమా నుండి గతకొద్ది రోజులుగా ఎలాంటి అప్డేట్ రాలేదు. దసరా కానుకగా ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేస్తారని ప్రకటించినా.. ఆ సమయంలో ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ రావడంతో ఈ సినిమా టీజర్‌‌ను వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఈ చిత్ర టీజర్‌కు సంబంధించి దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజా అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

Hanu-Man : తెలుగులో టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ సూపర్ హీరో ఫిల్మ్ ‘హను-మాన్‌’..

దీనికి సంబంధించి ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో ఓ క్లూ ఇచ్చారు. నవంబర్ 7న హనుమాన్ సినిమా టీజర్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయబోతున్నట్లు ఆయన పేర్కొన్నాడు. ఈ అప్డేట్‌తో ప్రేక్షకులు ఈ సినిమా టీజర్ కోసం అప్పుడే ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటిస్తోండగా, అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.