Hanu-Man : తెలుగులో టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ సూపర్ హీరో ఫిల్మ్ ‘హను-మాన్‌’..

ఒరిజినల్‌ ఇండియన్‌ సూపర్‌ హీరో ఫిల్మ్‌ ‘హను-మాన్‌’ టైటిల్, మోషన్‌ పోస్టర్‌ను మే 29న విడుదల చేశారు..

Hanu-Man : తెలుగులో టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ సూపర్ హీరో ఫిల్మ్ ‘హను-మాన్‌’..

Hanu Man

Hanu-Man: తెలుగు తెరపై సూపర్‌ హీరోస్‌ సినిమాలను ఈ తరం ప్రేక్షకులు ఇప్పటివరకు చూసింది లేదు. ‘జాంబీ రెడ్డి’ సినిమాతో జాంబీస్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన క్రియేటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ మరోసారి ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చూట్టారు. తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్‌ జానర్‌ను పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సారి మరింత కొత్తగా, లార్జ్‌ స్కేల్‌లో ఈ చిత్రం ఉండబోతుంది అని తెలిపారు. తన బర్త్‌‌డే సందర్భంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. సినిమాటిక్‌ యూనివర్స్‌లో సూపర్‌ హీరోస్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉండనుంది. ఒరిజినల్‌ ఇండియన్‌ సూపర్‌ హీరో ఫిల్మ్‌ ‘హను-మాన్‌’ టైటిల్, మోషన్‌ పోస్టర్‌ను మే 29న విడుదల చేశారు.

మన పురాణాలు ఇతీహాసల్లో అద్భుతమైన శక్తులు ఉన్న సూపర్‌ హీరోస్‌ గురించి మనకు తెలుసు. వారి అపూర్వమైన శక్తులు, బలాలు, పోరాటపటిమ అద్భుతమైనవి. హాలీవుడ్‌ను సూపర్‌ హీరోస్‌ మూవీస్‌ రూల్‌ చేస్తున్నాయి. డిస్నీ, మార్వెల్‌ సూపర్‌ హీరోస్‌ ఫిల్మ్స్‌ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్‌ను రాబట్టాయి. ఇటీవల విడుదలైన సూపర్‌ హీరో ఫిల్మ్‌ ‘అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌’ ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్ళను రాబట్టింది. ఈ సూపర్‌ హీరో ఫిల్మ్‌ జానర్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. సూపర్‌ హీరోస్‌ చిత్రాల్లోని హీరో ఎలివేషన్స్, యాక్షన్‌ సీక్వెన్సెస్‌ ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పిస్తాయి.

భారతీయ పురాణాల నుంచి ‘హను-మాన్’ సినిమాకు స్ఫూర్తి పొందాము. భారతీయులుకు ‘హనుమాన్‌’ సూపర్‌హీరో. ఈ సినిమా టైటిల్‌లో హను మాన్ మధ్యలో వజ్రంతో ఉన్న సూర్యుడి లోగో ఉండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతుంది.. హను-మాన్‌’ మోషన్‌ పోస్టర్‌ విజువల్‌ అద్భుతంగా ఉండి మంచి స్పందన లభిస్తుంది. మోషన్‌ పోస్టర్‌లోని హిమాలయాల విజువల్స్‌ అత్యద్భుతంగా, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ సూపర్‌గా ఉంది. ‘హను-మాన్‌’ చిత్రం సరికొత్తగా ఉంటూ ఎగ్జైటింగ్‌గా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ..