Priyamani : ప్రియమణి పాన్ ఇండియా సినిమా ‘డాక్టర్ 56’.. విజయ్ సేతుపతి చేతుల మీదుగా ఫస్ట్ లుక్..

  హీరోయిన్ ప్రియమణి ఓ పక్కన సీనియర్ హీరోలకి హీరోయిన్ గా చేస్తూ మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తోంది. ఇక టీవీ షోలలో కూడా అలరిస్తుంది. తాజాగా ఓ పాన్ ఇండియా సినిమాతో రాబోతుంది ప్రియమణి..............

Priyamani : ప్రియమణి పాన్ ఇండియా సినిమా ‘డాక్టర్ 56’.. విజయ్ సేతుపతి చేతుల మీదుగా ఫస్ట్ లుక్..

Priyamani Pan India Movie first look released

Priyamani :  హీరోయిన్ ప్రియమణి ఓ పక్కన సీనియర్ హీరోలకి హీరోయిన్ గా చేస్తూ మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తోంది. ఇక టీవీ షోలలో కూడా అలరిస్తుంది. తాజాగా ఓ పాన్ ఇండియా సినిమాతో రాబోతుంది ప్రియమణి. డాక్టర్ 56 అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ బ్యానర్ శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ మీద టెలుగులో విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రియమణి నటించిన డాక్టర్ 56 అనే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ ఫస్ట్ లుక్ అప్డేట్‌ను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేతుల మీద రిలీజ్ చేశారు. ఈ సినిమాని సౌత్‌లోని అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

BiggBoss 6 Day 43 : ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే.. బురద నీళ్లతో నామినేషన్స్.. గొడవలతో దద్దరిల్లిన బిగ్‌బాస్

ఈ సినిమాకు కథ, కథనాలను ప్రవీణ్‌ అందిస్తుండగా, రాజేష్‌ ఆనందలీల దర్శకత్వం వహిస్తున్నారు. హరిహర పిక్చర్స్ మీద ఈ సినిమాను ప్రవీణ్‌ రెడ్డి. టి నిర్మిస్తున్నారు. నోబిన్ పాల్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణితో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో ప్రవీణ్, దీపక్ రాజ్‌శెట్టి, రమేష్‌ భట్, యతిరాజ్, వీణా పొన్నప్ప, మంజునాథ్ హెగ్డే, స్వాతి తదితరులు నటిస్తున్నారు.