Rajinikanth : సైలెంట్‌ సునామి సృష్టించిన ‘జైలర్’..

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు వేడుకలు 'జైలర్' టీజర్ తో మరెంత రెట్టింపు అయిని. ఈమధ్య కాలంలో అయన నుంచి ఆ రేంజ్ సినిమాలు రాకపోవడంతో తలైవా అభిమానులు నిరాశపడ్డారు. డాక్టర్, బీస్ట్ సినిమాలతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న నెల్సన్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండంతో భారీ అంచనాలే నెలకొన్నాయి.

Rajinikanth : సైలెంట్‌ సునామి సృష్టించిన ‘జైలర్’..

Rajinikanth Jailer teaser released

Rajinikanth : సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు వేడుకలు ‘జైలర్’ టీజర్ తో మరెంత రెట్టింపు అయిని. నిజానికి పాన్ ఇండియా ఇమేజ్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ, రజినీకాంత్ ఆ ఇమేజ్ ని ఎప్పుడో అందుకున్నాడు. రజిని సినిమాలు కోసం బాలీవుడ్ స్టార్స్ కూడా ఎదురుచూసేవారు అంటే, అయన రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోండి.

Rajinikanth : స్టైల్ అంటే రజనీకాంత్.. రజనీకాంత్ అంటే స్టైల్.. రజిని బర్త్‌డే స్పెషల్..

పాన్ ఇండియా మార్కెట్ తో పాటు జపాన్ వంటి ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా రజిని సినిమా సత్తా చూపించేది. కాగా ఈమధ్య కాలంలో అయన నుంచి ఆ రేంజ్ సినిమాలు రాకపోవడంతో తలైవా అభిమానులు నిరాశపడ్డారు. ప్రస్తుతం రజినికాంత్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ తో కలిసి ‘జైలర్’ అనే సినిమా చేస్తున్నాడు. డాక్టర్, బీస్ట్ సినిమాలతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న నెల్సన్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండంతో భారీ అంచనాలే నెలకొన్నాయి.

నేడు రజిని బర్త్ డే కావడంతో మూవీ టీమ్.. జైలర్ టీజర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో రజినికాంత్ జైలర్ గా కనిపించబోతున్నాడు. ఇక విడుదలైన టీజర్ లో ఎటువంటి డైలాగ్స్ లేకుండా, రజిని ఫైట్ కి సిద్దమవుతున్న విజువల్స్ తో టీజర్ ని కట్ చేశాడు దర్శకుడు. అనిరుద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ లోని ఇంటెన్స్ ని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. మొత్తంగా రజినీకాంత్ సైలెంట్ గా ఒక సునామిని సృష్టించాడు అనే చెప్పాలి. సన్ పిక్చర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. దాదాపు 20 ఏళ్ళ తరువాత రమ్యకృష్ణ ఈ సినిమాలో రజినీతో కలిసి నటిస్తుంది.