Ramarao On Duty: ‘రామారావు ఇన్ యాక్షన్’ మేకింగ్ వీడియో

మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శరత్ మండవ....

Ramarao On Duty: ‘రామారావు ఇన్ యాక్షన్’ మేకింగ్ వీడియో

Ramarao On Duty Action Making Video Released

Ramrao On Duty: మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రాబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో రవితేజ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతుందని, ప్రేక్షకులు ఆయన పాత్రను పూర్తిగా ఎంజాయ్ చేస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Ramarao On Duty: రామారావు ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే..?

కాగా ఈ సినిమా నుండి తాజాగా ఓ మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. రామారావు యాక్షన్ మోడ్‌లో ఉన్న ఈ మేకింగ్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లో రవితేజ ఏమాత్రం తన ఎనర్జీని తగ్గకుండా చేస్తున్న సీన్స్ ఈ వీడియోలో మనకు చూపించారు. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతున్నట్లుగా చిత్ర యూనిట్ ఈ వీడియో ద్వారా తెలిపే ప్రయత్నం చేసింది.

Ramarao On Duty: రామారావు మాస్ ట్రైలర్ లోడింగ్…!

శరత్ మండవ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రవితేజ ఓ పవర్‌ఫుల్ ప్రభుత్వ ఉద్యోగిగా తన సత్తా చాటనుండగా, మరో నటుడు వేణు తొట్టెంపూడి చాలా రోజుల తరువాత ఈ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మనకు కనిపించనున్నాడు. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సామ్ సీఎస్ అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా బీజీఎం ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఉండబోతుందని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. జూలై 16న ఈ సినిమా ట్రైలర్‌ను లాంఛ్ చేస్తుండగా, ఈ చిత్రాన్ని జూలై 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.