Ramarao On Duty: రామారావు మాస్ ట్రైలర్ లోడింగ్…!

మాస రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను....

Ramarao On Duty: రామారావు మాస్ ట్రైలర్ లోడింగ్…!

Raviteja Ramarao On Duty Mass Trailer Loading

Ramarao On Duty: మాస రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంగా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో రవితేజ ఓ సిన్సియర్ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. కాగా ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని మాస్ రాజా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Ramarao On Duty: నా పేరు సీసా.. స్వర్గానికి వీసా.. అదిరిపోయిన మాస్ ట్రీట్!

ఇక ఈ సినిమా నుండి తాజాగా ఓ అప్ డేట్ ను వదిలారు చిత్ర యూనిట్. ఈ సినిమా మాస్ ట్రైలర్ లోడ్ అవుతుందని చిత్ర యూనిట్ పేర్కొంది. దీంతో ఈ ట్రైలర్ కట్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో మరోసారి రవితేజ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. కాగా ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.

Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!

రవితేజ సరసన ఈ సినిమాలో ఇద్దరు బ్యూటీలు హీరోయిన్లుగా చేస్తున్నారు. రజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ ఈ సినిమాలో మంచి స్కోప్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమా ట్రైలర్ అనౌన్స్ మెంట్ ను అతి త్వరలో ప్రకటిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొనడంతో మాస్ రాజా ఫ్యాన్స్, ఈ ట్రైలర్ కోసం ఆతృతగా చూస్తున్నారు. ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుందా అని వారు ఇప్పటినుంచే అంచనాలు పెంచేస్తున్నారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తుండగా, సామ్ సిఎస్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.