Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది....

Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!

Ramarao On Duty: మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.

Ramarao On Duty: రామారావు చార్జి తీసుకునేది అప్పుడే!

అయితే తాజాగా ఈ సినిమాపై మాస్ వర్గాల్లో అంతగా బజ్ క్రియేట్ కాలేదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలోని మాస్ మసాలా సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ‘‘నా పేరు సీసా..’’ అంటూ సాగే ఈ పాటలో హాట్ ఐటెం బాంబ్ అన్వేషి జైన్ ఘాటైన అందాల ఆరబోతతో పాటు అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు కూడా ఉండబోతున్నట్లు ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ పాటకు లిరిక్స్ ప్రముఖ రచయిత చంద్రబోస్ అందించగా, ఈ పాటను స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ ఆలపించింది.

Ramarao on Duty: రిలీజ్ డేట్ అనౌన్స్.. రామారావు వచ్చేది ఎప్పుడంటే?

సామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ మాస్ మసాలా ఫుల్ సాంగ్‌ను జూలై 2న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. దీంతో ఈ పూర్తి పాటను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మాస్ ఆడియెన్స్ అప్పుడే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లలో మనకు చూపించారు. ఈ సినిమాలో రవితేజ సరసన అందాల భామలు దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూలై 29న భారీ అంచనాల మధ్య రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.