Keerthy Suresh: కళావతి.. అవుతోందా శ్రీమతి?

అందాల భామ కీర్తి సురేష్ సౌత్ ఇండస్ట్రీలో మంచి ఫేం ఉన్న బ్యూటీగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. కాగా, తమిళ మీడియాలో కీర్తి సురేష్ గురించి ఓ వార్త జోరుగా ప్రచారం అవుతోంది. త్వరలోనే కీర్తి సురేష్ పెళ్లి పీటలెక్కబోతుందనే వార్త కోలీవుడ్‌లో జోరుగా వినిపిస్తోంది.

Keerthy Suresh: కళావతి.. అవుతోందా శ్రీమతి?

Keerthy Suresh: అందాల భామ కీర్తి సురేష్ సౌత్ ఇండస్ట్రీలో మంచి ఫేం ఉన్న బ్యూటీగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఈ బ్యూటీ తమిళంతో పాటు తెలుగులోనూ అదిరిపోయే సక్సెస్ అందుకుంది. లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో కీర్తి పర్ఫార్మెన్స్ ఆమెకు ఏకంగా నేషనల్ అవార్డును తెచ్చిపెట్టింది. ఇక ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా మారింది ఈ బ్యూటీ. అయితే ఇటీవల మహేష్ బాబుతో కలిసి ‘సర్కారు వారి పాట’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది.

Keerthy Suresh : తెలుపులో తళతళలాడుతున్న కళావతి..

కాగా, తమిళ మీడియాలో కీర్తి సురేష్ గురించి ఓ వార్త జోరుగా ప్రచారం అవుతోంది. త్వరలోనే కీర్తి సురేష్ పెళ్లి పీటలెక్కబోతుందనే వార్త కోలీవుడ్‌లో జోరుగా వినిపిస్తోంది. కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఆమె కోసం ఓ వరుడిని చూశారని.. ప్రముఖ రాజకీయనేత కొడుకు, పాపులర్ బిజినెస్‌మెన్‌ను కీర్తికి వరుడిగా చూసినట్లుగా కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇక తల్లిదండ్రులు చూసిన సంబంధం తనకు కూడా నచ్చడంతో కీర్తి కూడా ఈ పెళ్లికి సై అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఏదీ ఇప్పటివరకు రాలేదు.

Keerthy Suresh: కళావతి.. రూటు మార్చాల్సిందేనమ్మా!

ప్రస్తుతం కీర్తి సురేష్ పెళ్లి వార్తలు తెలుగు మీడియాలో కూడా చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తపై అటు కీర్తి సురేష్ గాని, ఆమె తల్లిదండ్రులు గాని ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే.. కీర్తి సురేష్ ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘భోళాశంకర్’ సినిమాలో చిరు చెల్లిగా నటిస్తోంది. దీంతో పాటు పలు కొత్త ప్రాజెక్టులను ఓకే చేసే పనిలో బిజీగా ఉందట ఈ బ్యూటీ.