Sadaa : మీరెవరు నాకు పెళ్లి చేసుకోమని చెప్పడానికి.. నాకు కావాల్సిన వాడు ఎలా ఉండాలంటే.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సదా..

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా పెళ్లి టాపిక్ వస్తే సీరియస్ అయి తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. సదా మాట్లాడుతూ.. ''మ‌న సంతోషం కోసం ఇత‌రుల‌పై ఆధాప‌డడానికి పెళ్లి చేసుకుంటే అవతలి వాళ్ళు సంతోషంగా ఉండలేరు. నీ సంతోషం కోసం.............

Sadaa : మీరెవరు నాకు పెళ్లి చేసుకోమని చెప్పడానికి.. నాకు కావాల్సిన వాడు ఎలా ఉండాలంటే.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సదా..

Sadaa spoke about her marriage

Sadha :  జయం, దొంగ దొంగది, నాగ, అపరిచితుడు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులని మెప్పించిన సదా గత నాలుగేళ్లుగా సినిమాలకి దూరంగా ఉంటుంది. సినిమాలకి దూరంగా ఉన్నా తమిళ్, తెలుగు బుల్లితెరపై పలు షోలలో కనిపిస్తూ అలరిస్తుంది సదా. అయితే 38 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు ఈ భామ.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా పెళ్లి టాపిక్ వస్తే సీరియస్ అయి తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. సదా మాట్లాడుతూ.. ”మ‌న సంతోషం కోసం ఇత‌రుల‌పై ఆధాప‌డడానికి పెళ్లి చేసుకుంటే అవతలి వాళ్ళు సంతోషంగా ఉండలేరు. నీ సంతోషం కోసం నువ్వు ఇంకో వ్య‌క్తిపై ఆధార‌ప‌డితే నీ ప్రెష‌ర్ కూడా అత‌నే భ‌రించాలి. నేను నా యూట్యూబ్ ఛానెల్‌ మొదలుపెట్టినప్పుడు చాలా మంది పెళ్లి చేసుకోండి, పిల్ల‌ల్ని క‌నండి అని కామెంట్స్ చేశారు. అసలు మన జీవితంపై అలా కామెంట్స్ చేసే హక్కు వాళ్లకి ఎవరిచ్చారు. మనకి పెళ్లి చేసుకొని వేరేవాళ్లు ఎందుకు చెప్పాలి. అయినా ప్రస్తుతం ప‌ది పెళ్లిళ్లు అవుతుంటే అందులో 5 జంట‌లైనా పెళ్లి త‌ర్వాత హ్యాపీగా ఉంటున్నారా” అని సీరియస్ గానే రియాక్ట్ అయింది.

Vijay Devarakonda-Sukumar : సుకుమార్-విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోయిందా.. క్లారిటీ ఇచ్చిన విజయ్..

పోనీ పెళ్లి చేసుకుంటే ఎలాంటి వాడు అయి ఉండాలి అని అడిగితే సదా మాట్లాడుతూ.. ”నేను పెళ్లి చేసుకునే వ్యక్తి కచ్చితంగా శాఖాహారి అయి ఉండాలి. ధ‌న‌వంతుడు కాకపోయినా పర్లేదు కానీ అతను బతకడం కోసం పక్కన వాళ్ళ మీద ఆధారపడకూడదు. తన అవసరాల వరకు తాను సొంతంగా సంపాదించుకోగలగాలి” అని తెలిపింది.