Gurthunda Seethakalam: శీతాకాలం రాకముందే వస్తోన్న ‘గుర్తుందా శీతాకాలం’

ట్యాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తున్న తాజా చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చిన చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మరోసారి ఫిక్స్ చేశారు.

Gurthunda Seethakalam: శీతాకాలం రాకముందే వస్తోన్న ‘గుర్తుందా శీతాకాలం’

Satyadev Tamannaah Gurthunda Seethakalam Locks Its Release Date

Gurthunda Seethakalam: ట్యాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తున్న తాజా చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు నాగశేఖర్ తెరకెక్కిస్తుండగా ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాయి.

Gurthunda Seethakalam: ఎట్టకేలకు రిలీజ్ డేట్‌తో వచ్చిన గుర్తుందా శీతాకలం!

ఇక ఈ సినిమాను పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చిన చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మరోసారి ఫిక్స్ చేశారు. గుర్తుందా శీతాకాలం చిత్రాన్ని సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ మూవీలో సత్యదేవ్ తమన్నాల కెమిస్ట్రీ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Gurthunda Seethakalam Trailar: చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చని కాలం.. శీతాకాలం!

ప్ర‌తీ ఒక్క‌రు త‌మ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విష‌యాల్ని ఎప్ప‌టికీ మ‌రిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వ‌చ్చే యూత్ లైఫ్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు జీవితాంతం గుర్తుకు వ‌స్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాద‌క‌ర‌మైన సంఘ‌ట‌ణ‌లు ప్రేక్ష‌కుల‌కి గుర్తు చేసే ఉద్దేశంతో ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. కాగా, ఇప్ప‌టికే ఈ సినిమా టైటిల్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. క‌న్న‌డ‌లో విడుద‌లై సూప‌ర్ హిట్ అయిన ‘ల‌వ్ మాక్‌టైల్’ ఆధారంగా ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.