Oke Oka Jeevitham Trailer: ‘ఒకే ఒక జీవితం’ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్!

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 12.30 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది.

Oke Oka Jeevitham Trailer: ‘ఒకే ఒక జీవితం’ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్!

Sharwanand Oke Oka Jeevitham Trailer Gets Release Date

Oke Oka Jeevitham Trailer: యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను సై-ఫై డ్రామాగా తెరకెక్కిస్తుండగా, నూతన దర్శకుడు శ్రీకార్తిక్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాయి.

Oke Oka Jeevitham: ఒకే ఒక జీవితం.. వచ్చేది అప్పుడే!

కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తుండగా, ఈ ట్రైలర్ ను సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 12.30 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. కణం అనే పేరుతో తమిళంలోనూ తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ను కూడా అదే రోజు, అదే సమయానికి రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Oke Oka Jeevitham : ‘అమ్మా.. నే కొలిచే శారదవే.. నిత్యం నను నడిపే సారథివే’.. సిరివెన్నెలకే సాధ్యం..

ఇక ఈ సినిమాలో అమలా అక్కినేని ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా, జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. సెప్టెంబర్ 9న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.