Alluri Trailer: అల్లూరి ట్రైలర్ టాక్.. పోలీస్ పవర్‍‌తో అదరగొట్టిన శ్రీవిష్ణు!

యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అల్లూరి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో పవర్‌ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో శ్రీవిష్ణు ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక రిలీజ్ దగ్గరపడుతుండటంతో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ఈ థియేట్రికల్ ట్రైలర్ లాంఛ్ చేశారు.

Alluri Trailer: అల్లూరి ట్రైలర్ టాక్.. పోలీస్ పవర్‍‌తో అదరగొట్టిన శ్రీవిష్ణు!

Sree Vishnu Alluri Trailer Impressive

Alluri Trailer: యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అల్లూరి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో పవర్‌ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో శ్రీవిష్ణు ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక రిలీజ్ దగ్గరపడుతుండటంతో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ఈ థియేట్రికల్ ట్రైలర్ లాంఛ్ చేశారు.

Sree Vishnu Alluri Trailer: అల్లూరి కోసం గ్యాంగ్‌లీడర్.. అభిమానులకు ట్రీట్ ఖాయమేనా..?

ఇక అల్లూరి ట్రైలర్ ఆద్యంతం పవర్‌ప్యాక్డ్ కంటెంట్‌తో నింపేశారు చిత్ర యూనిట్. పోలీస్ పవర్ ఎలా ఉంటుందో మరోసారి ఈ ట్రైలర్‌లో చూపించారు. నిజాయితీగా ఉండే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌కు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి.. వాటిని అతడు ఎలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.. అనే పాయింట్‌తో ఈ సినిమా కథ సాగనుంది. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీవిష్ణు రెచ్చిపోయి నటించాడు. ఈ ట్రైలర్‌లోనే అతడి డెడికేషన్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో పవర్‌ఫుల్ డైలాగులు కూడా ఉండబోతున్నట్లు ఈ ట్రైలర్‌లో చూపించారు.

Alluri Movie: పోలీస్ డ్రెస్‌లో అదరగొట్టిన ప్రొడ్యూసైర్.. అల్లూరి వినూత్న ప్రమోషన్స్!

అటు పోలీస్ ఆఫీసర్‌కు సంబంధించిన ప్రేమ యాంగిల్‌ను కూడా మనకు ఈ ట్రైలర్‌లో చూపించారు. మొత్తంగా చూస్తే.. ఓ పవర్ ప్యాక్డ్ ట్రైలర్‌గా అల్లూరి థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం మేజర్ అసెట్‌గా మారనుంది. ఈ ట్రైలర్‌లోని బీజీఎం చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఇక ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోండగా, సుమన్, తనికెళ్ల భరణి, మధుసూధన్ రావు, రాజా రవీంద్ర, పృథ్వీ రాజ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 23న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.