Sree Vishnu Alluri Trailer: అల్లూరి కోసం గ్యాంగ్‌లీడర్.. అభిమానులకు ట్రీట్ ఖాయమేనా..?

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు, ప్రస్తుతం ‘అల్లూరి’ అనే పవర్‌ఫుల్ సినిమాతో మనముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సెప్టెంబర్ 23న ఈ సినిమాను భారీ అంచనాల మధ్య రిలీజ్ చేస్తుండటంతో, థియేట్రికల్ ట్రైలర్‌ను సెప్టెంబర్ 16న సాయంత్రం 5.04 గంటలకు లాంఛ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

Sree Vishnu Alluri Trailer: అల్లూరి కోసం గ్యాంగ్‌లీడర్.. అభిమానులకు ట్రీట్ ఖాయమేనా..?

Nani To Launch Sree Vishnu Alluri Trailer

Sree Vishnu Alluri Trailer: వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు, ప్రస్తుతం ‘అల్లూరి’ అనే పవర్‌ఫుల్ సినిమాతో మనముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ‘నిజాయితీకి మారుపేరు’ అనే ట్యాగ్‌లైన్ ఈ సినిమాకు ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. కెరీర్‌లో తొలిసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీవిష్ణు నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి.

Alluri Movie: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న అల్లూరి!

కాగా, ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఇక ఈ ట్రైలర్‌ను టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా లాంఛ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. సెప్టెంబర్ 23న ఈ సినిమాను భారీ అంచనాల మధ్య రిలీజ్ చేస్తుండటంతో, థియేట్రికల్ ట్రైలర్‌ను సెప్టెంబర్ 16న సాయంత్రం 5.04 గంటలకు లాంఛ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ సినిమాలో శ్రీవిష్ణు పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండనుందని.. ఈ థియేట్రికల్ ట్రైలర్‌లో కేవలం శాంపిల్ మాత్రమే చూస్తారని చిత్ర యూనిట్ అంటోంది.

Alluri : మరో అల్లూరి సీతారామరాజు.. శ్రీ విష్ణు కొత్త ప్రయోగం..

మొత్తానికి ప్రేక్షకులు మెచ్చే కథలతో సినిమాలు చేసే శ్రీవిష్ణు, ఈసారి ఓ పోలీస్ స్టోరీతో మనముందుకు రాబోతుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఈ సినిమా శ్రీవిష్ణు కెరీర్‌లో ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.