Sree Vishnu: శ్రీవిష్ణు సంచలన వ్యాఖ్యలు.. చిరంజీవి తరవాతి స్థానం ‘నాని’దే!

శ్రీవిష్ణు తాజా చిత్రం అల్లూరి ఈ నెల 23న విడుదల కానుంది. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బెక్కం వేణుగోపాల్ నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్ కు నేచురల్ స్టార్ నాని హాజరయ్యాడు. శ్రీవిష్ణు మాట్లాడుతూ...

Sree Vishnu: శ్రీవిష్ణు సంచలన వ్యాఖ్యలు.. చిరంజీవి తరవాతి స్థానం ‘నాని’దే!

Sree Vishnu Comments on Nani

Sree Vishnu: శ్రీవిష్ణు తాజా చిత్రం అల్లూరి ఈ నెల 23న విడుదల కానుంది. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బెక్కం వేణుగోపాల్ నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్ కు నేచురల్ స్టార్ నాని హాజరయ్యాడు. ట్రైలర్ ని విడుదల చేసిన నాని మాట్లాడుతూ ”ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం ప్రేక్షకులు స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్న సినిమాలనే ఇష్టపడుతున్నారు, ఈ ట్రైలర్ లో నాకు అవి కనిపించిని.

Alluri Movie: అల్లూరి కోసం వస్తున్న పుష్పరాజ్.. తగ్గేదే లే!

ఇక శ్రీవిష్ణు చాలా అరుదైన నటుడు, అతని సినిమాల్లో పాత్రలు కనిపిస్తాయి కానీ నటులు కాదు. అందుకే శ్రీవిష్ణు నాకు చాలా ఇష్టం. నిజానికి శ్రీవిష్ణు రిజర్వ్డ్ పర్సన్ ల కనిపిస్తాడు గాని, అతడిలోని మరో కోణాన్ని నేను ‘అంటే సుందరానికి’ సక్సెస్ పార్టీలో చూశాను. ఈ సినిమాలో ఆ కోణాన్ని బయటపెడతాడని ఆశిస్తున్నాను. యంగ్ టాలెంట్ ని ప్రోత్సహించే బెక్కం వేణుగోపాల్ వంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి” అంటూ వెల్లడించాడు.

అలాగే శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘‘నేను మంచి పాత్రలో నటించడమే కాదు, ఒక మంచి నిజాయితీతో కూడిన సినిమా చేశామని నమ్ముతున్నాను. ఇటువంటి సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన నాని.. ట్రైలర్‌ లాంచ్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి రావాలంటే, ఒకప్పుడు చిరంజీవి, రవితేజ స్ఫూర్తి. కానీ ఈ తరానికి, రాబోయే తరానికి మాత్రం నానినే స్ఫూర్తిగా తీసుకుంటారు” అని వ్యాఖ్యానించాడు.