SSMB 29 : హాలీవుడ్ ఏజెన్సీతో రాజమౌళి ఒప్పందం.. మహేష్ మూవీ మరో రేంజ్‌లో..

రాజమౌళి తన తర్వాతి సినిమా మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఓ గ్లోబల్‌ యాక్షన్‌ అడ్వెంచరస్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోందని హాలీవుడ్ మీడియా ముందు ప్రకటించాడు. దీంతో మహేష్-రాజమౌళి సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రాజమౌళి ..............

SSMB 29 : హాలీవుడ్ ఏజెన్సీతో రాజమౌళి ఒప్పందం.. మహేష్ మూవీ మరో రేంజ్‌లో..

SSRajamouli has signed with Hollywood agency #CAA for his next film with Mahesh Babu

SSMB 29 :  రాజమౌళి బాహుబలి సినిమాతోనే మన తెలుగు చిత్రపరిశ్రమ స్థాయిని పెంచాడు. ఇక RRR సినిమాతో హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్లి ప్రపంచం నలుమూలలా మన గొప్పతనాన్ని చాటాడు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రేక్షకులు, టెక్నీషియన్లు, ప్రముఖులు.. చాలా మంది RRR సినిమాని అభినందించారు. హాలీవుడ్ లో ఇప్పుడు రాజమౌళి బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం రాజమౌళి హాలీవుడ్ లో జరుగుతున్న ఓ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంటున్నారు. అక్కడ మీడియాతో ముచ్చటిస్తున్నారు.

రాజమౌళి తన తర్వాతి సినిమా మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఓ గ్లోబల్‌ యాక్షన్‌ అడ్వెంచరస్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోందని హాలీవుడ్ మీడియా ముందు ప్రకటించాడు. దీంతో మహేష్-రాజమౌళి సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రాజమౌళి హాలీవుడ్‌ లీడింగ్‌ క్రియేటివ్‌ ఆర్టిస్ట్స్‌ ఏజెన్సీ (CAA)కు ఒక ప్రాజెక్టు కోసం సంతకం చేశాడని సమాచారం.

Gauri Khan : కొడుకు డ్రగ్స్ కేసుపై మొదటిసారి స్పందించిన షారుఖ్ భార్య..

లాస్‌ ఏంజెల్స్‌ కేంద్రంగా నడిచే ఏజెన్సీ CAA. ఇది సినిమాల ఎండార్స్‌మెంట్‌, బ్రాండింగ్‌, మార్కెటింగ్‌తోపాటు చాలామంది హాలీవుడ్ డైరెక్టర్లు, నటీనటులకు సినిమాలు, డేట్స్ చూసుకోవడం చేస్తుంది. మహేష్ సినిమా కోసం ఈ ఏజెన్సీతో రాజమౌళి ఒప్పందం కుదుర్చుకున్నట్టు హాలీవుడ్ మీడియా సమాచారం. ఇదే కనుక నిజమైతే ఈ సారి మహేష్ -రాజమౌళి సినిమా పాన్ వరల్డ్ రిలీజ్ గ్యారెంటీ. ఈ విషయం తెలియడంతో మహేష్ అభిమానులు సినిమాపై మరిన్ని అంచనాలు పెట్టుకుంటున్నారు. అయితే దీనిపై అధికారిక సమాచారం మాత్రం ఇంకా రాజమౌళి ఇవ్వలేదు.