Gauri Khan : కొడుకు డ్రగ్స్ కేసుపై మొదటిసారి స్పందించిన షారుఖ్ భార్య..

కొన్ని నెలల క్రితం షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలుకి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ సంచలనమే అయింది. ఇప్పటివరకు ఈ అరెస్ట్ పై షారుఖ్ భార్య గౌరీఖాన్ స్పందించలేదు. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో..............

Gauri Khan : కొడుకు డ్రగ్స్ కేసుపై మొదటిసారి స్పందించిన షారుఖ్ భార్య..
ad

Gauri Khan :  బాలీవుడ్ హిట్ షో కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ కొనసాగుతోంది. ఇప్పటికే 11 ఎపిసోడ్లు పూర్తి చేసుకొని పన్నెండో ఎపిసోడ్ తాజాగా విడుదల అయింది. ఈ ఎపిసోడ్ లో షారుఖ్ భార్య గౌరీఖాన్, సీనియర్ నటీమణులు భావన పాండే, మహీప్ కపూర్ గెస్టులుగా వచ్చారు. ఇక ఎప్పటిలాగే కరణ్ కొన్ని పిచ్చి ప్రశ్నలు అడిగాడు. అలాగే ఈ ఎపిసోడ్ లో గౌరీఖాన్ ని తన కొడుకు డ్రగ్స్ కేసు గురించి అడిగాడు కరణ్.

కొన్ని నెలల క్రితం షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలుకి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ సంచలనమే అయింది. ఇప్పటివరకు ఈ అరెస్ట్ పై షారుఖ్ భార్య గౌరీఖాన్ స్పందించలేదు. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ మీ అబ్బాయి అరెస్ట్ అయినప్పుడు మీరు మీరు చాలా బాధపడ్డారు అనుకుంటా, ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు అని గౌరీఖాన్ ని అడిగాడు.

Prabhakar : వీడి యాటిట్యూడ్ ఏంట్రా.. స్టార్ నటుడి తనయుడిపై ట్రోల్స్.. మంచిదేగా అంటున్న నటుడు

దీనికి గౌరీఖాన్ సమాధానమిస్తూ.. ”ఆ సమయంలో మా కుటుంబం మొత్తం చాలా బాధపడ్డాం. నాకు తల్లిగా ఒక భయంకరమైన అనుభవం అది. ఆ సంఘటనని మరచిపోలేము. కానీ ఆ సమయంలో మాకు చాలా మంది సినీ పరిశ్రమ వాళ్ళు, బయటి వాళ్ళు సపోర్ట్ గా నిలిచారు. మాకు కాల్స్ చేసి, మమ్మల్ని కలిసి మోరల్ సపోర్ట్ ఇచ్చి ఓదార్చారు. ఆ సమయంలో మాకు సపోర్ట్ గా నిలిచిన వారందరికి ధన్యవాదాలు” అని తెలిపింది.