Prabhakar : వీడి యాటిట్యూడ్ ఏంట్రా.. స్టార్ నటుడి తనయుడిపై ట్రోల్స్.. మంచిదేగా అంటున్న నటుడు

తాజాగా ప్రభాకర్ ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా చంద్రహాస్ పై వచ్చిన ట్రోల్స్ గురించి అడిగారు. దీనిపై ప్రభాకర్ స్పందిస్తూ.. ''ఏం పర్లేదు. ఎలా అయితే ఏంటి వాడు జనాల్లోకి వెళ్లాడు. వాళ్లు తిట్టుకుంటున్నారా? పొగుడుతున్నారా పక్కనపెడితే జనాల్లో.................

Prabhakar : వీడి యాటిట్యూడ్ ఏంట్రా.. స్టార్ నటుడి తనయుడిపై ట్రోల్స్.. మంచిదేగా అంటున్న నటుడు

Serial Actor Prabhakar reacts about trolls on his son

Prabhakar :  తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్ లో ఎన్నో ఏళ్లుగా నటిస్తూ స్టార్ యాక్టర్ గా ఎదిగారు. నిర్మాతగా కూడా మారి పలు సీరియల్స్ ని నిర్మించారు ప్రభాకర్. కొన్ని సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు చేశారు. ఇప్పుడు కూడా నటుడిగా, నిర్మాతగా బుల్లితెరపై తిరుగులేకుండా కొనసాగుతున్నారు ప్రభాకర్. తాజాగా ప్రభాకర్‌ తన కొడుకు చంద్రహాస్ ని హీరోగా పరిచయం చేయబోతున్నాడు.

ఇటీవల తన కొడుకు మొదటి సినిమా రాబోతుంది అంటూ ఓ ఈవెంట్ ని నిర్వహించారు ప్రభాకర్. ఈ ఈవెంట్లో తన కొడుకుని మీడియాకి పరిచయం చేశాడు. అయితే ఈ ఈవెంట్లో చంద్రహాస్ నిల్చున్న తీరు, అతని స్టైల్, అతని మాట్లాడిన విధానం చూసి సోషల్ మీడియాలో అతన్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. వీడు హీరో ఏంట్రా, ఒక్క సినిమా కుడా రిలీజ్ అవ్వలేదు వీడి యాటిట్యూడ్ ఏంట్రా, మరీ ఓవర్ చేస్తున్నాడు, పెద్ద స్టార్ లా బిల్డప్ ఇస్తున్నాడు, ఆ నిల్చోవడం ఏంటి, ఆ స్టైల్ ఏంటి అంటూ బాగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

BiggBoss 6 Day 18 : ఈ వారం కెప్టెన్సీ పోటీలో ఉన్నది వీళ్ళే.. గొడవలతో పాటు కొన్ని జోకులు కూడా..

తాజాగా ప్రభాకర్ ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా చంద్రహాస్ పై వచ్చిన ట్రోల్స్ గురించి అడిగారు. దీనిపై ప్రభాకర్ స్పందిస్తూ.. ”ఏం పర్లేదు. ఎలా అయితే ఏంటి వాడు జనాల్లోకి వెళ్లాడు. వాళ్లు తిట్టుకుంటున్నారా? పొగుడుతున్నారా పక్కనపెడితే జనాల్లో మంచి రీచ్ వచ్చింది. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా ఇంత బాగా ప్రమోట్ అయితే మంచిదే కదా. చంద్రహాడ్ నిలబడ్డ తీరు వాళ్ళకి నచ్చలేదు, అదే చెప్పారు. రేపు సినిమా రిలీజ్ అయ్యాక నటుడిగా వాడి యాక్టింగ్ బాగుంటే బాగా చేశాడంటారు, లేకపోతే లేదు. ఏదైనా జనాలు డిసైడ్ చేయాల్సిందే కదా. వాళ్ళకి అనిపించింది చెప్తారు” అని పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు.