Swathimuthyam: స్టార్ హీరోలతో పోటీకి రెడీ అంటోన్న స్వాతిముత్యం..?

టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సోదరుడిగా బెల్లంకొండ గణేశ్ హీరోగా ఎంట్రీ ఇస్తూ చేస్తున్న సినిమా ‘స్వాతిముత్యం’, ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను తొలుత ఆగస్టులో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించినా, కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. దీంతో ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Swathimuthyam: స్టార్ హీరోలతో పోటీకి రెడీ అంటోన్న స్వాతిముత్యం..?

Swathimuthyam To Release On October 5 Only

Swathimuthyam: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సోదరుడిగా బెల్లంకొండ గణేశ్ హీరోగా ఎంట్రీ ఇస్తూ చేస్తున్న సినిమా ‘స్వాతిముత్యం’, ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను పూర్తి యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించడంతో బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Swathimuthyam : నితిన్, నిఖిల్ కోసం పక్కకు తప్పుకున్న బెల్లంకొండ హీరో.. స్వాతిముత్యం వాయిదా..

ఈ సినిమాను తొలుత ఆగస్టులో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించినా, కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. దీంతో ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే.. దసరా బరిలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్‌ఫాదర్’, అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘ది ఘోస్ట్’ చిత్రాలు ఖర్చీఫ్ వేసుకుని ఉన్నాయి. దీంతో ఈ రెండు బడా చిత్రాలతో పోటీకి స్వాతిముత్యం వస్తాడా లేడా అని అందరూ చర్చించుకుంటున్నారు.

Swathimuthyam : చిన్న బెల్లంకొండ ‘స్వాతిముత్యం’..

కాగా, ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఏదేమైనా అక్టోబర్ 5న రిలీజ్ చేస్తామని వారు ప్రకటించారు. దీంతో దసరా ఫైట్‌లో ఇద్దరు స్టార్ హీరోలతో స్వాతిముత్యం ఎంతమేర పోటీ ఇవ్వగలడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరి ఈ సినిమా దసరా బరిలో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాను లక్ష్మణ్ కె కృష్ణ డైరెక్ట్ చేస్తుండగా, సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. వర్షా బొల్లమ్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.