Swathimuthyam : నితిన్, నిఖిల్ కోసం పక్కకు తప్పుకున్న బెల్లంకొండ హీరో.. స్వాతిముత్యం వాయిదా..

బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేష్ హీరోగా పరిచయం అవుతూ వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా స్వాతిముత్యం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన 'స్వాతిముత్యం' సినిమా ఆగస్టు 13న విడుదల కావాల్సి ఉండగా......

Swathimuthyam : నితిన్, నిఖిల్ కోసం పక్కకు తప్పుకున్న బెల్లంకొండ హీరో.. స్వాతిముత్యం వాయిదా..

Swathimuthyam :  బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేష్ హీరోగా పరిచయం అవుతూ వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా స్వాతిముత్యం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ‘స్వాతిముత్యం’ సినిమా ఆగస్టు 13న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నామని నిర్మాణ సంస్థ తెలియచేసింది. దీనికి సంబంధించి ఓ ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు.

ఈ ప్రెస్ నోట్ లో.. ”ఈ నిర్ణయం పట్ల మేం సంతోషంగా లేనప్పటికీ, వాయిదా వేయక తప్పడం లేదు. రిలీజ్ డేట్‌ని దృష్టిలో పెట్టుకుని షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, రిలీజ్ ప్లాన్‌తో ముందుకు వెళ్లాలనుకున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా నిర్ణయం తీసుకోక తప్పలేదు. విడుదల తేదీని ముందుగానే ప్రకటించి, ప్రణాళికలతో పూర్తి సిద్ధంగా ఉన్నప్పటికీ పరిశ్రమ గురించి ఆలోచించి మేం వెనక్కి తగ్గుతున్నాము. మహమ్మారి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ పరిస్థితి అంత గొప్పగా లేదు. ఇంతకుముందులా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. మా సినిమా విడుదలకు సరైన సమయం కుదిరినప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి చూసి,ఇతర చిత్రాల నిర్మాతల పరిస్థితి చూసి మా సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. ప్రేక్షకులు థియేటర్‌లకు వచ్చి మునుపటిలాగ సినిమాలను ఆదరిస్తారని ఆశిస్తున్నాము” అని తెలిపారు.

Karthikeya 2 : నితిన్‌తో పోటీ తప్పుకున్న నిఖిల్.. కార్తికేయ 2 మళ్ళీ వాయిదా

ఒకపక్క థియేటర్ కి జనాలు రావట్లేదు, కలెక్షన్స్ రావట్లేదు అని సినీ పరిశ్రమ అంతా చర్చల మీద చర్చలు జరుపుతుంది. దీంతో ఆగస్టు 12న నితిన్ మాచర్ల నియోజకవర్గం, నిఖిల్ కార్తికేయ 2 రావాల్సి ఉండగా పోటీ ఎందుకు అని నిఖిల్ ఒక రోజుకు తన సినిమాని వాయిదా వేసి 13న రిలీజ్ చేస్తున్నాడు. దీంతో స్వాతిముత్యం టీం కూడా పరిశ్రమలో మంచి వాతావరణం కోసం, అన్ని సినిమాలు బాగుండాలని 13న రావాల్సిన తమ సినిమాని వాయిదా వేసుకున్నాయి. అయితే కొత్త రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. దీనికి ఓ సరదా వీడియో కూడా చేసి హీరో, హీరోయిన్స్ తో ఈ విషయాన్ని చెప్పించారు.