Swathimuthyam: ట్రైలర్‌తో దిగుతున్న స్వాతిముత్యం.. ఎప్పుడంటే..?

బెల్లంకొండ గణేశ్ హీరోగా పరిచయమవుతున్న మూవీ ‘స్వాతిముత్యం’ గతంలోనే రిలీజ్ కావాల్సి ఉన్నా, పలు కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ‘స్వాతిముత్యం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఈ సినిమాకు పెట్టడంతో ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేసింది.

Swathimuthyam: ట్రైలర్‌తో దిగుతున్న స్వాతిముత్యం.. ఎప్పుడంటే..?

Swathimuthyam Trailer Date And Time Locked

Swathimuthyam: బెల్లంకొండ గణేశ్ హీరోగా పరిచయమవుతున్న మూవీ ‘స్వాతిముత్యం’ గతంలోనే రిలీజ్ కావాల్సి ఉన్నా, పలు కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ‘స్వాతిముత్యం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఈ సినిమాకు పెట్టడంతో ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను లక్ష్మణ్ కె కృష్ణ అనే కొత్త దర్శకుడు పూర్తి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Swathimuthyam: స్టార్ హీరోలతో పోటీకి రెడీ అంటోన్న స్వాతిముత్యం..?

కాగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాను రెండు బడా సినిమాలకు పోటీగా రిలీజ్ చేస్తున్నారంటే.. ఈ సినిమా కంటెంట్‌పై చిత్ర యూనిట్ ఏ స్థాయిలో ధీమాగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేసింది. ‘స్వాతిముత్యం’ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను 26 సెప్టెంబర్ ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ఓ పోస్టర్ ద్వారా వెల్లడించింది.

Swathimuthyam : చిన్న బెల్లంకొండ ‘స్వాతిముత్యం’..

వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో రావు రమేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ అద్భుతమైన సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను గాడ్‌ఫాదర్, ది ఘోస్ట్ చిత్రాలకు పోటీగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మరి ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.