Swathimuthyam Trailer: స్వాతిముత్యం ట్రైలర్.. పండుగకు పర్ఫెక్ట్ సబ్జెక్టుతో దిగుతోన్న బెల్లంకొండ హీరో!

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుగా, టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడిగా వెండితెరకు హీరోగా పరిచయమవుతున్నాడు బెల్లంకొండ గణేశ్. ఆయన నటించిన తొలి సినిమా ‘స్వాతిముత్యం’ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా, పలు కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే, ఈ సినిమాతో బెల్లంకోండ గణేశ్ హీరోగా పర్ఫెక్ట్ కథతో వస్తున్నాడని అనిపిస్తుంది.

Swathimuthyam Trailer: స్వాతిముత్యం ట్రైలర్.. పండుగకు పర్ఫెక్ట్ సబ్జెక్టుతో దిగుతోన్న బెల్లంకొండ హీరో!

Swathimuthyam Trailer Filled As Romantic Comedy Entertainer

Swathimuthyam Trailer: ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుగా, టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడిగా వెండితెరకు హీరోగా పరిచయమవుతున్నాడు బెల్లంకొండ గణేశ్. ఆయన నటించిన తొలి సినిమా ‘స్వాతిముత్యం’ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా, పలు కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల క్లారిటీ ఇచ్చింది. దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి.

Swathimuthyam Director : చిరంజీవి, నాగార్జునకి పోటీగా.. అది నిర్మాతల నిర్ణయం.. నాకు భయంగానే ఉంది..

కాగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే, ఈ సినిమాతో బెల్లంకోండ గణేశ్ హీరోగా పర్ఫెక్ట్ కథతో వస్తున్నాడని అనిపిస్తుంది. ఈ ట్రైలర్ ఆద్యంతం రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తుండగా, వీరిద్దరి కాంబినేషన్ చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. అటు తొలి సినిమా అయినా కూడా బెల్లంకొండ గణేశ్ డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్ బాగా ఉన్నాయని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అయితే దసరా బరిలో ఇప్పటికే చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’, నాగార్జున ‘ది ఘోస్ట్’ చిత్రాలు ఉండటంతో ఆ రెండు సినిమాలకు ఇది పోటీ ఇవ్వగలదా అని పలువురు అనుమానం వ్యక్తం చేశారు.

Swathimuthyam: ట్రైలర్‌తో దిగుతున్న స్వాతిముత్యం.. ఎప్పుడంటే..?

కానీ, ఈ చిత్ర ట్రైలర్ అలాంటి అనుమానాలను పూర్తిగా తొలగించేసింది. పండుగకు కేవలం యాక్షన్, డ్రామా ఉన్న సినిమాలే కాకుండా.. ఇలా ఫ్యామిలీ ఆడియెన్స్ మొత్తం కలిసి చూసే సినిమాలు కూడా ప్రేక్షకాదరణ పొందుతాయని.. అందుకే ఇలాంటి ఫ్యామిలీ సబ్జెక్ట్‌తో వస్తున్న సినిమాను దసరా బరిలో రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఏదేమైనా పండుగకు రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కలగలుపుకుని వస్తున్న ఈ ‘స్వాతిముత్యం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే దసరా వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తుండగా, మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.