Taapsee Pannu : మాటిమాటికి మీడియా మీద ఫైర్ అవుతున్న తాప్సీ.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

 తాప్సీ ఈమధ్య మీడియాలో లైమ్ లైట్లో ఉండడం కాదు, అసలు న్యూసే తాప్సీ చుట్టూ తిరుగుతోంది. మీడియా ఎక్కడ కనిపిస్తే అక్కడ కస్సుమంటోంది తాప్సీ. మీడియా కూడా తాప్సీ అంటే అంతే ఇంట్రస్ట్ చూపిస్తోంది. ఇటీవల తాప్సీ రెగ్యులర్ గా..................

Taapsee Pannu : మాటిమాటికి మీడియా మీద ఫైర్ అవుతున్న తాప్సీ.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

Taapsee Pannu fires on Media

Taapsee Pannu :  తాప్సీ ఈమధ్య మీడియాలో లైమ్ లైట్లో ఉండడం కాదు, అసలు న్యూసే తాప్సీ చుట్టూ తిరుగుతోంది. మీడియా ఎక్కడ కనిపిస్తే అక్కడ కస్సుమంటోంది తాప్సీ. మీడియా కూడా తాప్సీ అంటే అంతే ఇంట్రస్ట్ చూపిస్తోంది. ఇటీవల తాప్సీ రెగ్యులర్ గా కాంట్రవర్సీ అవుతోంది. కమర్షియల్ హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కొట్టని తాప్సీ ఇటీవల వరసగా డిఫరెంట్ సినిమాలతో అటు ధియేటర్లలో, ఇటు ఓటీటీల్లో తెగ హడావిడి చేస్తోంది. అయితే తన సినిమాలు, ప్రమోషన్ల కంటే మీడియాతో గొడవలతోనే హాట్ టాపిక్ అవుతోంది తాప్సీ. ఈమధ్య వరసగా మీడియాతో ఆర్గుమెంట్స్ పెట్టుకొని హైలెట్ అవుతోంది తాప్సీ.

లేటెస్ట్ గా సినిమా చూసొస్తున్న తాప్సీని ఈమధ్యే చనిపోయిన బాలీవుడ్ కమెడియన్ రాజుశ్రీవాస్తవ్ గురించి చెప్పమంటే ఏం చెప్పాలి అంటూ తనచుట్టూ చేరిన మీడియాని అరిచేసి తప్పించుకుని వెళ్లిపోయింది. దీంతో మీడియాతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా తాప్సీపై ఫైర్ అవుతున్నారు. ఒక స్టార్ కమెడియన్ చనిపోతే అయన గురించి ఓ రెండుముక్కలు కూడా మాట్లాడలేవా, మీడియా మీద అరిచేసి వెళ్ళిపోతావా అని ట్రోల్ చేస్తున్నారు.

SSMB 29 : హాలీవుడ్ ఏజెన్సీతో రాజమౌళి ఒప్పందం.. మహేష్ మూవీ మరో రేంజ్‌లో..

ఇప్పుడే కాదు తాప్సీ అంతకుముందు కూడా మీడియాతో గట్టిగానే వాదిస్తోంది. ఫ్రెండ్ తో కలిసి రెస్టారెంట్ లో కనిపించిన తాప్సీని చుట్టుముట్టిన మీడియాని చూసి నేనేమన్నా ఈవెంట్ కి వచ్చానా, ఎందుకు నా వెంట పడుతున్నారు అంటూ చిరాకు పడింది. మొన్నీమధ్య ఓ ప్రెస్ మీట్ లో కూడా అరవకండి, ఎందుకలా అరుస్తున్నారు అంటూ ఇరిటేట్ అయ్యింది. క్వశ్చన్స్ అడిగేముందు విషయాలు తెలుసుకుని హోమ్ వర్క్ చేసుకుని రండి అంటూ మీడియాకి కౌంటర్ ఇచ్చింది తాప్సీ.

ఇక దొబారా సినిమా ప్రమోషన్ల టైమ్ లోకూడా మీడియాతో మర్యాదగా మాట్లాడండి అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఫోటోల కోసం ఆపిన మీడియాని.. నన్నెందుకు తిడుతున్నారు, నా మీద ఎందుకు అరుస్తున్నారు, నేను మీకోసం రాలేదు, ప్రోగ్రామ్ కోసం వచ్చాను. మీరు మర్యాదగా మాట్లాడితే నేను కూడా మర్యాదగానే మాట్లాడతానుంటూ క్లాస్ పీకింది మీడియాకి. దీంతో ఇటీవల వరుసగా తాప్సీ మీడియాతో ఎందుకు గొడవపడుతుందో, ఎందుకు కాంట్రవర్సీ చేసుకుంటుందో అని ఆలోచిస్తున్నారు.