The Ghost Movie: ‘ది ఘోస్ట్’ మూవీ రన్‌టైమ్ లాక్.. ఎంతంటే..?

అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి బజ్ క్రియేట్ అయ్యింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లుగా తెలుస్తోంది.

The Ghost Movie: ‘ది ఘోస్ట్’ మూవీ రన్‌టైమ్ లాక్.. ఎంతంటే..?

The Ghost Movie Runtime Locked

The Ghost Movie: అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

The Ghost Movie: సెన్సార్ పనులు ముగించుకున్న ‘ది ఘోస్ట్’

ఇక ఈ సినిమాను చిత్ర యూనిట్ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంతో ఈ సినిమాలో యాక్షన్ డోస్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. కాగా ఇటీవల ఈ సినిమా సెన్సార్ పనులు ముగించుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా రన్‌టైమ్‌ను 135 నిమిషాలుగా ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్.

The Ghost Movie: ‘వేగం’గా దూసుకొస్తున్న ది ఘోస్ట్ రొమాంటిక్ సాంగ్!

కాగా, ఈ సినిమాలో నాగ్ NIA ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, ఆయన సరసన అందాల భామ సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో నాగ్ చేసే యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. భరత్ సౌరభ్, మార్క్ కె రాబిన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందో తెలియాలంటే అక్టోబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే.