The Ghost Movie: ‘ది ఘోస్ట్’ మూవీ షూటింగ్ ముగించేసిన నాగార్జున

అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి చిత్ర యూనిట్ ఓ అప్‌డేట్‌ను రివీల్ చేసింది.

The Ghost Movie: ‘ది ఘోస్ట్’ మూవీ షూటింగ్ ముగించేసిన నాగార్జున

The Ghost Movie: అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా నుండి ‘ది కిల్లింగ్ మిషీన్’గా నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. కాగా, తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి చిత్ర యూనిట్ ఓ అప్‌డేట్‌ను రివీల్ చేసింది.

The Ghost: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ది ఘోస్ట్’

ఈ సినిమా షూటింగ్‌ను ముగించేసుకున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో మరోసారి నాగ్ తన అభిమానుల కోసం వినూత్నమైన పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

The Ghost: కిల్లింగ్ మెషిన్‌గా రాబోతున్న నాగ్.. ఎప్పుడంటే..?

కాగా, ఈ సినిమాలో నాగ్ సరసన అందాల భామ సోనాల్ చౌహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను సునీల్ నారంగ్, పి.రామ్ మోహన్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా నుండి టీజర్, ట్రైలర్లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.