TV Actress : టీవీ నటి ఆత్మహత్యాయత్నం.. నిమ్స్‌కి తరలించిన పోలీసులు..

ప్రముఖ టీవీ నటి ఆత్మహత్యాయత్నం చేసింది. హైదరాబాద్ పంజాగుట్టలో ఈ సంఘటన జరిగింది. సోమవారం సాయంత్రం ఆ టీవీ నటి పంజాగుట్ట పోలీసులకు ఫోన్‌ చేసి...................

TV Actress : టీవీ నటి ఆత్మహత్యాయత్నం.. నిమ్స్‌కి తరలించిన పోలీసులు..

Maithili

TV Actress :  ప్రముఖ టీవీ నటి ఆత్మహత్యాయత్నం చేసింది. హైదరాబాద్ పంజాగుట్టలో ఈ సంఘటన జరిగింది. సోమవారం సాయంత్రం ఆ టీవీ నటి పంజాగుట్ట పోలీసులకు ఫోన్‌ చేసి తన భర్తపై చర్యలు తీసుకోవాలని కోరింది. అంతేకాకుండా తన భర్త బండి కూడా సీజ్‌ చేయాలని, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులకు చెప్పింది. ఈ సంఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది.

ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అడ్రెస్ కనుక్కొని పోలీసులు ఇంటికి వచ్చారు. తమకి ఫోన్ చేసిన నటిని మైథిలి అనే మహిళగా పోలీసులు గుర్తించారు. పోలీసులు వెళ్లే సమయానికే మైథిలి 8 బ్రీజర్లు తాగి స్లీపింగ్‌ ట్యాబ్లెటను కూడా మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. అపస్మారక స్థితిలో ఉన్న మైథిలిని సమీపంలోని నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.

F3 Movie : F3 సినిమా మూడు రోజుల కలెక్షన్స్..

ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. అయితే గతంలో కూడా మైథిలి తన భర్తపై పోలీసు కేసు పెట్టినట్లు తెలిసింది. అప్పుడు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ సారి ఇలా అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం.