ANR Prathibimbalu: 40 ఏళ్ల తరువాత రిలీజ్ అవుతున్న అక్కినేని ‘ప్రతిబింబాలు’.. ఏకంగా 250 థియేటర్లు!

లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వర్ రావు నటించిన సినిమాలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అయితే నాగేశ్వర్ రావు సుదీర్ఘ సినీ కెరీర్ లో ఆయన నటించిన ఓ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాలేదనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఏఎన్నార్ నటించిన ‘ప్రతిబింబాలు’ అనే సినిమా దాదాపు 40 ఏళ్ల క్రితమే షూటింగ్ ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది.

ANR Prathibimbalu: 40 ఏళ్ల తరువాత రిలీజ్ అవుతున్న అక్కినేని ‘ప్రతిబింబాలు’.. ఏకంగా 250 థియేటర్లు!

Unreleased Movie Of ANR Prathibimbalu To Get Released In 250 Theatres

ANR Prathibimbalu: లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వర్ రావు నటించిన సినిమాలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆయన నటించిన సామాజిక, సాంఘిక, పౌరాణిక చిత్రాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. అయితే నాగేశ్వర్ రావు సుదీర్ఘ సినీ కెరీర్ లో ఆయన నటించిన ఓ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాలేదనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అవును.. ఏఎన్నార్ నటించిన ‘ప్రతిబింబాలు’ అనే సినిమా దాదాపు 40 ఏళ్ల క్రితమే షూటింగ్ ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది.

ANR: అక్కినేని నాగేశ్వర రావు గారి అరుదైన ఫోటోలు..

కానీ, అప్పట్లో కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రిలీజ్ కు నోచుకోలేదు. దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు తెరకెక్కించిన ఈ సినిమాను విష్ణుప్రియ సినీ కంబైన్స్ బ్యానర్ పై నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించారు. అయితే ఈ సినిమాను ఎట్టకేలకు నవంబర్ 5న రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. ‘ప్రతిబింబాలు’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అని.. అయితే అప్పట్లో ఈ సినిమాను రిలీజ్ చేయలేకపోయానని.. ఇప్పుడు సరికొత్త హంగులు అద్ది, కొత్త టెక్నాలజీని వినియోగించి ఈ సినిమాను నేటితరం ఆడియెన్స్ మెచ్చే విధంగా రిలీజ్ చేయబోతున్నాం’’ అని తెలిపారు.

ANR Jayanthi : ఏఎన్నార్ లివ్స్ ఆన్.. నాగార్జున ఎమోషనల్ వీడియో..

ఇక ఈసినిమాలో నాగేశ్వర్ రావు నటనకు ప్రేక్షకులు మరోసారి నీరాజనాలు పలుకుతారని.. ఈ సినిమాలో హీరోయిన్ గా జయసుధ సహజ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా, ఈ సినిమాను ఏకంగా 250 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటిచింది.