ANR Jayanthi : ఏఎన్నార్ లివ్స్ ఆన్.. నాగార్జున ఎమోషనల్ వీడియో..

తండ్రి ఏఎన్నార్ జయంతి సందర్భంగా తనయుడు కింగ్ నాగార్జున ఎమోషనల్ వీడియో షేర్ చేశారు..

ANR Jayanthi : ఏఎన్నార్ లివ్స్ ఆన్.. నాగార్జున ఎమోషనల్ వీడియో..

Anr Jayanthi

Updated On : September 20, 2021 / 12:15 PM IST

ANR Jayanthi: ‘నటసామ్రాట్’ అక్కినేని నాగేశ్వర రావు.. తెలుగు సినిమా చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించి, తెలుగు ప్రేక్షకాభిమానుల ఆదరణ చూరగొన్న మహోన్నత వ్యక్తి. సెప్టెంబర్ 20న అక్కినేని పుట్టినరోజు. 1923 సెప్టెంబర్ 20న కృష్ణాజిల్లా రామాపురంలో జన్మించారాయన.

Anr

 

ఏఎన్నార్ జయంతి సందర్భంగా ప్రేక్షకులు, అక్కినేని అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
తనయుడు అక్కినేని నాగార్జునతో సహా అక్కినేని కుటుంబ సభ్యులు ఏఎన్నార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

Anr

 

తండ్రి జయంతిని పురస్కరించుకుని ‘కింగ్’ నాగార్జున ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. నాన్న గారికి ఇష్టమైన పంచెకట్టులో కనిపించిన నాగ్.. ఏఎన్నార్‌కి పంచె కట్టు అంటే చాలా ఇష్టమని, ఆయన ధరించిన పొందూర్ ఖద్దర్ వస్త్రాలనే తాను వేసుకున్నానని, తండ్రి నవరత్నాల ఉంగరం, నవరత్నాల హారంతో పాటు వాచ్ పెట్టుకున్నానని చాలా సంతోషంగా చెప్పారు. ఇవన్నీ వేసుకుంటే నాన్న గారు నాతోనే ఉన్నట్టు ఉంటుంది అంటూ ఎమోషనల్ అయ్యారు. నాన్న గారి పంచె కట్టు అందాన్ని మీ ముందుకు తీసుకురావడం కోసమే మా ఈ ప్రయత్నం.. #ANRLivesOn అంటూ.. తను నటిస్తున్న కొత్త సినిమా ‘బంగార్రాజు’ పోస్టర్ చూపించారు నాగార్జున..