BoyapatiRAPO: వరుస అప్డేట్స్‌తో అదరగొట్టిన రామ్ బోయపాటిలు!

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తన నెక్ట్స్ మూవీని యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో కన్ఫం చేశాడు. ఈ సినిమాను ఇటీవల అఫీషియల్‌గా లాంచ్ కూడా చేశాడు. అయితే దసరా కానుకగా ఈ సినిమా నుండి వరుస అప్డేట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు చిత్ర యూనిట్.

BoyapatiRAPO: వరుస అప్డేట్స్‌తో అదరగొట్టిన రామ్ బోయపాటిలు!

Updates From BoyapatiRAPO Impresses Fans

BoyapatiRAPO: మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను లాస్ట్ మూవీ ‘అఖండ’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ నటించగా, బోయపాటి-బాలయ్య కాంబినేషన్ లో అఖండ హ్యాట్రిక్ విజయాన్ని అందించింది. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో బోయపాటి తన నెక్ట్స్ మూవీని యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో కన్ఫం చేశాడు.

BoyapatiRAPO: దసరా రోజున గట్టిగా ఇస్తామంటోన్న బోయపాటి-రామ్!

ఈ సినిమాను ఇటీవల అఫీషియల్ గా లాంచ్ కూడా చేశాడు. అయితే దసరా కానుకగా ఈ సినిమా నుండి వరుస అప్డేట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు చిత్ర యూనిట్. పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల భామ శ్రీలీలా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది. ఇక ఈ సినిమాకు సంగీతాన్ని మ్యూజిక్ సెన్సేషన్ థమన్ అందిస్తున్నట్లు వారు వెల్లడించారు.

BoyapatiRAPO: తమ సినిమాకు రెమ్యునరేషన్ వదులుకున్న బోయపాటి-రామ్‌లు

అంతేగాక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను అక్టోబర్ 6 నుండి స్టార్ట్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా తెలిపింది. ఇలా పండుగ రోజున వరుస అప్డేట్స్ తో బోయపాటి, రామ్ పోతినేనిలు తమ సినిమా గురించి సోషల్ మీడియాలో హోరెత్తించారు. ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. మరి ఈ సినిమాతో రామ్, బోయపాటిలు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.