Ram Pothineni: బాలీవుడ్ పాపతో రామ్ చిందులు.. బోయపాటి టార్గెట్ అదేనా?

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇటీవల తన తాజా చిత్రాన్ని మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో స్టార్ట్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ మూవీలో ఓ అదిరిపోయే ఐటెం సాంగ్‌ను పెట్టాలని బోయపాటి ఆలోచిస్తున్నాడట.

Ram Pothineni: బాలీవుడ్ పాపతో రామ్ చిందులు.. బోయపాటి టార్గెట్ అదేనా?

Urvashi Rautela Item Song In Ram Pothineni Boyapati Movie

Ram Pothineni: యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇటీవల తన తాజా చిత్రాన్ని మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో స్టార్ట్ చేశాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఇటీవల మొదలుపెట్టారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Ram Pothineni: రామ్‌తో సినిమాపై గౌతమ్ క్లారిటీ!

ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాలో మాస్ అంశాలను బోయపాటి తనదైన మార్క్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తుండగా, ఈ మూవీలో ఓ అదిరిపోయే ఐటెం సాంగ్‌ను కూడా పెట్టాలని ఆయన ఆలోచిస్తున్నాడట. అందుకే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను ఈ ఐటెం సాంగ్‌లో తీసుకోవాలని బోయపాటి అండ్ టీమ్ భావిస్తోందట. ఇక ఈ సాంగ్‌లో ఆమెతో కలిసి రామ్ వేసే చిందులు ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Ram Pothineni : పూరి గారితో మళ్ళీ సినిమా చేస్తా.. ఇస్మార్ట్ శంకర్‌కి మించి..

అయితే ఈ వార్తపై అఫీషియల్‌గా ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో ఈ సినిమాలో నిజంగానే ఊర్వశి రౌతేలా ఐటెం సాంగ్ చేస్తుందా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.