Venkatesh: ఆ డైరెక్టర్‌ను ఖుషీ చేస్తున్న వెంకీ మామ..?

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా తన ఏజ్‌కు తగ్గ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అవుతున్నాడు. తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో వెంకీ నెక్ట్స్ మూవీకి సంబంధించి ఓ వార్త జోరుగా హల్‌చల్ చేస్తోంది. దర్శకుడు శివ నిర్వాణ చెప్పిన ఓ స్టోరీలైన్‌కు కూడా వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

Venkatesh: ఆ డైరెక్టర్‌ను ఖుషీ చేస్తున్న వెంకీ మామ..?

Venkatesh To Do Next Movie With Shiva Nirvana

Venkatesh: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా తన ఏజ్‌కు తగ్గ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అవుతున్నాడు. ఎప్పుడూ వైవిధ్యానికి ప్రాధాన్యతనిచ్చే వెంకీ, మల్టీస్టారర్ సినిమాలకు సైతం ఓకే అంటున్నాడు. ఇప్పటికే ఈ కోవలో పలు సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు. అయితే ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్‌తో పనిచేసేందుకు కూడా వెంకీ రెడీ అవుతున్నాడు.

Venkatesh : వెంకటేష్ నెక్స్ట్ సినిమా ఏంటో?? అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్..

ఇటీవల ఎఫ్3 మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఈ స్టార్ హీరో, ‘ఓరి దేవుడా’ అనే సినిమాలో ఓ కేమియో రోల్‌లో కనిపించనున్నాడు. ఇక ఇప్పటికే వెంకీ తన తొలి వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ వెబ్ సిరీస్‌లో యంగ్ హీరో రానా దగ్గుబాటితో కలిసి వెంకీ కనిపిస్తుండటంతో దగ్గుబాటి అభిమానులు ఈ వెబ్ సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో వెంకీ నెక్ట్స్ మూవీకి సంబంధించి ఓ వార్త జోరుగా హల్‌చల్ చేస్తోంది.

Venkatesh: మల్టీస్టారర్‌కే చిరునామా.. సోలోగా రావా వెంకీ మామ..?

దర్శకుడు శివ నిర్వాణ చెప్పిన ఓ స్టోరీలైన్‌కు కూడా వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఎప్పటినుండో వెంకటేష్‌తో ఓ సినిమా చేయాలని చూస్తున్న శివ నిర్వాణ ఎట్టకేలకు ఆయనకు తన స్టోరీలైన్ వినిపించాడని.. అది నచ్చిన వెంకీ కూడా ఆయనతో సినిమా చేసేందుకు రెడీ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం శివ నిర్వాణ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, అందాల భామ సమంత జోడీగా ‘ఖుషి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాకే వెంకీతో ఆయన సినిమా చేయనున్నాడట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.