Vijayendraprasad : టాలీవుడ్ హబ్ ని ఏర్పాటు చేయండి.. ప్రధాని మోదీని తీసుకొస్తాను..

ఈ నేపథ్యంలో విజయేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ.. ''టాలీవుడ్ హబ్ ను ఏర్పాటు చేయాలి. దీనికి దక్షిణ భారత చలచిత్ర ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణలను ఆహ్వానించి ఒక మహత్తరమైన సభ..............

Vijayendraprasad : టాలీవుడ్ హబ్ ని ఏర్పాటు చేయండి.. ప్రధాని మోదీని తీసుకొస్తాను..

Vijayendra Prasad says Create a Tollywood hub and organize a grand meeting

Vijayendraprasad :  ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు రాజమౌళి తండ్రి కె.వి. విజయేంద్ర ప్రసాద్ గారు ఇటీవల రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో ఆయన బాధ్యత మరింత పెరిగిందని మరిన్ని కథలు రెడీ చేస్తున్నానని గతంలో తెలిపారు. తాజాగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కార్యాలయానికి విజయేంద్రప్రసాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శులు శ్రీ టి. ప్రసన్న కుమార్ మరియు శ్రీ మోహన్ వడ్లపట్ల ఆయన్ని శాలువాతో సత్కరించారు.

Amala Paul : ఎవరికీ తెలియకుండా అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుందా..? అది కూడా ఫెయిల్ అయిందా..?

ఈ నేపథ్యంలో విజయేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ.. ”టాలీవుడ్ హబ్ ను ఏర్పాటు చేయాలి. దీనికి దక్షిణ భారత చలచిత్ర ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణలను ఆహ్వానించి ఒక మహత్తరమైన సభను నిర్వహించాలి. హైదరాబాద్ లో తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలుగు ఫిలిం ఛాంబర్ మరియు ఇతర సినిమా అసోసియేషన్స్ సహకారంతో ఈ సభని ఏర్పాటు చేయాలి. మీరు ఈ సభని ఏర్పాటు చేస్తే నేను గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని తీసుకొస్తాను. ఇప్పటికే నలుదిశలా కీర్తి గడించిన మన తెలుగు సినిమా పేరు, ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరిస్తాయి” అని తెలిపారు.