Satyendar Jain: ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్‭కు జైలులో సకల వసతులు.. ఆయన కోసం 10 మంది సేవకులు!

ఎనిమిది మంది కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తున్నారట. రూం క్లీనింగ్, బెడ్ సర్దడం, బయటి నుంచి ఆహారం తీసుకురావడం, మినరల్ వాటర్ ఏర్పాటు చేయడం, పళ్లు తీసుకురావడం, బట్టలు శుభ్రం చేయడం లాంటి పనుల కోసం ఈ ఎనిమిది ఉన్నారట. ఇక ఇద్దరు సూపర్ వైజర్లట. ఈ విషయాన్ని జైలు వర్గాలే వెల్లడించినట్లు సమాచారం. కాగా, తనకు బయటి నుంచి ఆహారం కావాలని జైన్ పెట్టుకున్న అర్జీని రోస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది

Satyendar Jain: ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్‭కు జైలులో సకల వసతులు.. ఆయన కోసం 10 మంది సేవకులు!

10 people were deployed to provide services to Satyendar Jain in Tihar jail

Satyendar Jain: అవినీతి కేసులో అరెస్టై తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సత్యేంద్ర జైన్‭కు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటికి వీడియోల కాంట్రవర్సీ గురించి తెలిసిందే. ఆయనకు జైలులో సర్వవైభోగాలు కొనసాగుతున్నట్లు కనిపిస్తున్న ఈ వీడియోలపై అటు బీజేపీ, ఇటు ఆప్ మధ్య తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరి కొన్ని కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. వీడియోల్లో కనిపించేది నిజమేనని, జైన్‭కు జైలులో సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, ఆయనను చూసుకునేందుకు 10 మంది సేవకులు కూడా ఉన్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.

Lalu Prasad Yadav: కిడ్నీ మార్పిడి చికిత్స కోసం సింగపూర్‌కు లాలూ.. కిడ్నీ దానం చేస్తున్న లాలూ కూతురు

ఎనిమిది మంది కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తున్నారట. రూం క్లీనింగ్, బెడ్ సర్దడం, బయటి నుంచి ఆహారం తీసుకురావడం, మినరల్ వాటర్ ఏర్పాటు చేయడం, పళ్లు తీసుకురావడం, బట్టలు శుభ్రం చేయడం లాంటి పనుల కోసం ఈ ఎనిమిది ఉన్నారట. ఇక ఇద్దరు సూపర్ వైజర్లట. ఈ విషయాన్ని జైలు వర్గాలే వెల్లడించినట్లు సమాచారం. కాగా, తనకు బయటి నుంచి ఆహారం కావాలని జైన్ పెట్టుకున్న అర్జీని రోస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. తనకు జైన్ పద్దతిలో ఆహారం కావాలని, తానిప్పుడు ఉపవాసంలో ఉన్నానని, తనకు పళ్లు, సలాడ్ లాంటివి అందించాలని ఆయన అర్జీ పెట్టుకున్నారు. ఈ విషయమై జైలు క్యాంటీన్ అధికారుల్ని కోర్టు ప్రశ్నించగా, తమకు జైల్ సూపరిండెంట్ నుంచి ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు.

Hyderabad Metro: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో నిర్మాణం.. డిసెంబర్ 9న శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్

దీనికి సంబంధించి ఒక వీడియో సైతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. జైన్ గదిలో కొంత మంది సేవకులు తమ పనులు చేస్తుండడం, కాసేపటికి వారితో జైన్ తీరిగ్గా సంభాషిస్తుండడాన్ని వీడియోలో చూడొచ్చు. జైలులో జైన్ ఖరీదైన ఆహారాన్ని తింటున్న వీడియోను బీజేపీ బయటికి విడుదల చేసిన అనంతరం, జైన్ పెట్టుకున్న అర్జీ విషయం చర్చలోకి వచ్చింది.

UP Police Tweet: ఎలాన్ మస్క్‭కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన యూపీ పోలీసులు.. ఫిదా అంటున్న నెటిజెన్లు