UP Police Tweet: ఎలాన్ మస్క్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన యూపీ పోలీసులు.. ఫిదా అంటున్న నెటిజెన్లు

UP Police's reply to Elon Musk's tweet is viral and the Internet loves it
UP Police Tweet: ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న అనంతరం నాటి నుంచి తన ట్వీట్లతో మరింత ఆసక్తి రేపుతున్నారు ఎలాన్ మస్క్. ఏదో ఒక సంచలన ప్రకటనలతో, కాంట్రవర్సీ వ్యాఖ్యలతో తరుచూ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు. అందరికీ సెటైర్లు వేస్తూ హడావుడి చేస్తున్న మస్క్‌కు తాజాగా యూపీ పోలీసులు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు. ఆయన చేసిన ట్వీట్‌కు బదులుగా ట్విట్టర్ వేదికగానే యూపీ పోలీసులు ఇచ్చిన ఈ కౌంటర్‌కు నెటిజెన్లు ఫిదా అంటున్నారు. అదిరిపోయిందంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు.
నవంబర్ 22న మస్క్ ఒక ట్వీట్ చేశారు. ‘‘కాస్త ఆగండి, నేనేదైనా ట్వీట్ చేస్తే, దానిని మీరు పనిగా పరిగణిస్తారా?’’ అని నెటిజెన్లను ప్రశ్నించారు. మస్క్ ఎంతో కొంటెగా చేసిన ఈ ట్వీట్‌పై యూపీ పోలీసులు అంత కంటే కొంటెగా స్పందించారు. ‘‘కాస్త ఆగండి, యూపీ పోలీసులు ట్విట్టర్ ద్వారా మీ సమస్యలు పరిష్కరిస్తే, దానిని మీరు పనిగా పరిగణిస్తారా’’ అని మస్క్ ట్వీట్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. వాస్తవానికి తన ట్వీట్లలో 90 శాతం ట్వీట్లు సాంకేతికత ఆధారంగా జనరేట్ అవుతాయని మస్క్ ఓ సందర్భంలో చెప్పారు. పైగా ఆయనపై ఇలాంటి ఆరోపణలు కూడా అనేకం ఉన్నాయి. ఇదే నేపథ్యంలో మస్క్ నుంచి ట్వీట్ రావడం, ఆ ట్వీట్‌ను ఉద్దేశిస్తున్నట్లుగానే యూపీ పోలీసులు ట్వీట్ చేయడం వైరల్ అవుతోంది.
Mahesh Babu : నాన్న నాకు ఎన్నో ఇచ్చాడు.. అందులో గొప్పది మీ అభిమానం.. మహేష్ బాబు!
అనంతరం ఈ రెండు ట్వీట్లను స్క్రీన్ షాట్ తీసి ‘అవును, పరిణించబడుతుంది’ అని యూపీ పోలీసులే మరో ట్వీట్ చేయడం గమనార్హం. యూపీ పోలీసులు స్పందించిన తీరుపై నెటిజెన్లు ఫిదా అంటున్నారు. ‘చాలా అద్భుతమైన రిప్లై’ అని ఒకరు, ‘యూపీ పోలీసులు ఇప్పుడు తమ రాష్ట్ర పరిధి దాటి సమస్యలు పరిష్కరిస్తున్నారు’ అంటూ మరొకరు ‘యూపీ పోలీసుల సేవకు పరిధులు లేవు’ అంటూ.. ఇలా నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Lalu Prasad Yadav: కిడ్నీ మార్పిడి చికిత్స కోసం సింగపూర్‌కు లాలూ.. కిడ్నీ దానం చేస్తున్న లాలూ కూతురు