Fire Haircut: ప్రాణాల మీదకు తెచ్చిన ‘ఫైర్ హెయిర్ కట్’.. తల ఎలా కాలిందో చూడండి.. వీడియో వైరల్

‘ఫైర్ హెయిర్ కట్’ చేయించుకుంటున్నారా? అయితే జాగ్రత్త! ఎందుకంటే తాజాగా ‘ఫైర్ హెయిర్ కట్’ ఒక యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ కటింగ్ చేసుకునేందుకు ప్రయత్నించిన కుర్రాడు ప్రస్తుతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Fire Haircut: ప్రాణాల మీదకు తెచ్చిన ‘ఫైర్ హెయిర్ కట్’.. తల ఎలా కాలిందో చూడండి.. వీడియో వైరల్

Fire Haircut: ‘ఫైర్ హెయిర్ కట్’ ఇప్పుడో ట్రెండుగా మారింది. హెయిర్ కట్ చేసేటప్పుడు జుట్టుకు నిప్పంటించి, ఆ మేరకు హెయిర్ సెట్ చేయడమే ఈ పద్ధతి. అయితే, తాజాగా ‘ఫైర్ హెయిర్ కట్’ ఒక యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది.

‘Chief Twit’ Elon Musk: బాత్‌రూం సింక్‌తో ట్విటర్ ప్రధాన కార్యాలయంలోకి ఎలాన్ మస్క్.. వీడియో వైరల్

గుజరాత్, వల్సాద్ జిల్లా, వాపి పట్టణంలో 18 ఏళ్ల కుర్రాడు బుధవారం, హెయిర్ కటింగ్ కోసం స్థానికంగా ఒక సెలూన్ షాప్‌కు వెళ్లాడు. అక్కడ హెయిర్ డ్రెస్సర్ అతడికి ‘ఫైర్ హెయిర్ కట్’ పద్ధతిలో హెయిర్ కట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడి తలపై ఒక కెమికల్ అప్లై చేసి, ఆ తర్వాత ఫైర్ అంటించబోయాడు. నిజానికి, ఆ మంట జుట్టుకు మాత్రమే అంటుకోవాలి. కానీ, అతడి తలంతా మంట అంటుకుంది. ముఖం, మెడపై కూడా మంటలు వ్యాపించాయి. దీంతో బాధితుడు భయంతో పరుగెత్తాడు. కటింగ్ చేస్తున్న హెయిర్ డ్రెస్సర్ మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ ఘటనలో అతడి తల, ముఖం, మెడపై గాయాలయ్యాయి.

BCCI’s Big Announcement: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజులు

వెంటనే అతడ్ని వాపి ఆస్పత్రికి తరలించారు. కానీ, అక్కడి నుంచి జిల్లా కేంద్రమైన వాల్సాద్‌లోని సివిల్ ఆస్పత్రికి పంపించారు అక్కడి డాక్టర్లు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ జరుపుతున్నారు. బాధితుడి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. బాధితుడి శరీరం పైభాగంలో గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.