BCCI’s Big Announcement: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజులు

భారత మహిళా క్రికెటర్లకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. మహిళా ప్లేయర్లపై వివక్ష చూపుతున్నారన్న విమర్శలకు తెరదించుతూ ఇకపై పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజు ఇవ్వాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టెస్ట్‌ మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డే మ్యాచ్‌కు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ.3 లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.

BCCI’s Big Announcement: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజులు

BCCI’s Big Announcement: భారత మహిళా క్రికెటర్లకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. మహిళా ప్లేయర్లపై వివక్ష చూపుతున్నారన్న విమర్శలకు తెరదించుతూ ఇకపై పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజు ఇవ్వాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టెస్ట్‌ మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డే మ్యాచ్‌కు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ.3 లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.

‘‘వివక్ష లేకుండా చూసేందుకు బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకుంది. మన బీసీసీఐ మహిళా క్రికెటర్లకు పురుషులతో సమానంగా ఫీజు ఇవ్వాలని నిర్ణయించింది. పురుష, మహిళా క్రికెటర్లకు సమానంగా ఫీజులు చెల్లించే విధానాన్ని తీసుకురావడం క్రికెట్ లో లింగ సమానత్వం విషయంలో కొత్త శకం. పురుష, మహిళా క్రికెటర్లు ఇకపై సమానంగా మ్యాచు ఫీజు పొందుతారు’’ అని జై షా తెలిపారు.

కొన్ని నెలల క్రితమే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కూడా పురుష, మహిళా క్రికెటర్లకు సమానంగా ఫీజు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. కాగా, 2023 నుంచి మహిళల ఐపీఎల్ మ్యాచులు నిర్వహించాలని బీసీసీఐ ఏజీఎం ఇటీవలే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఫీజు గురించి కూడా నిర్ణయం తీసుకుని మహిళా ప్లేయర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..