Horse Running In Tamilnadu: అమ్మకోసం పరుగు..! బస్సుపై గుర్రం బొమ్మ.. తన తల్లే అనుకొని పరుగెత్తుకుంటూ వెళ్లిన పిల్ల గుర్రం.. వీడియో వైరల్

అమ్మ.. ఆ పదం వింటేనే మనస్సంతా సంతోషంతో ఉప్పొంగి పోతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు తల్లి ప్రేమను పొందేందుకు తాపత్రయ పడుతూనే ఉంటారు. అయితే ఈ ప్రేమ మనుష్సుల్లోనే కాదు.. జంతువుల్లోనూ ఉంటుంది. తాజాగా పిల్ల గుర్రం తన తల్లికోసం పరుగులు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Horse Running In Tamilnadu: అమ్మకోసం పరుగు..! బస్సుపై గుర్రం బొమ్మ.. తన తల్లే అనుకొని పరుగెత్తుకుంటూ వెళ్లిన పిల్ల గుర్రం.. వీడియో వైరల్

Horse Runs

Horse Running In Tamilnadu: అమ్మ.. ఆ పదం వింటేనే మనస్సంతా సంతోషంతో ఉప్పొంగి పోతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు తల్లి ప్రేమకోసం తాపత్రయ పడుతూనే ఉంటారు. అయితే ఈ ప్రేమ మనుష్సుల్లోనే కాదు.. జంతువుల్లోనూ ఉంటుంది. తాజాగా తల్లికోసం ఓ పిల్ల గుర్రం బస్సు వెంట పరుగెత్తింది. బస్సుపై ఉన్న గుర్రం బొమ్మ తన తల్లిదే అనుకొని బస్సువెంట పరుగెత్తిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది.

Groom Friends: వింత కోరిక‌..! పెళ్లికూతురుతో స్టాంప్‌ పేప‌ర్స్ పై సంత‌కం చేయించిన పెళ్లికొడుకు స్నేహితులు.. ప్ర‌తీవారం ఆమె అందుకు ఒప్పుకోవాలంట‌ ..

తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. కోయంబత్తూరులోని బత్తీశ్వర దేవాలయం సమీపంలో దర్పణం మండపం, పండితుర ప్రాంతాల్లో పదికిపైగా గుర్రాలు ఉన్నాయి. తోటలోని గడ్డిని తింటూ ఆ ప్రాంతమంతా తిరుగుతున్నాయి. ఈ క్రమంలో గత వారంరోజుల క్రితం మందలోని తల్లిగుర్రం ఒకటి వేరే ప్రాంతానికి వెళ్లగా.. దాని నుండి పిల్ల గుర్రం విడిపోయింది. అప్పటి నుంచి పిల్ల గుర్రం తన తల్లి ఆచూకీ కోసం వెతుకుతుంది. ఈ క్రమంలో బస్ స్టేషన్ సమీపంలో ఉన్న పిల్ల గుర్రానికి గాంధీపురం వెళ్తున్న ప్రైవేట్ బస్సు పై గుర్రం బొమ్మ కనిపించింది. అది తన తల్లే అనుకొని వెంటనే పరుగుపెట్టుకుంటూ ఆ బస్సు దగ్గరకు వెళ్లింది. దీంతో బస్సువద్దనే కొద్దిసేపు అటూఇటూ తిరుగుతూ బస్సుపై ఉన్న గుర్రం బొమ్మను ముద్దాడే ప్రయత్నం చేసింది. ఇంతలోనే బస్సు వెళ్తుండటంతో తల్లి గుర్రం పరుగెడుతుందని భావించి బస్సు వెనుకాలే పిల్ల గుర్రం పరుగెత్తుకుంటూ వెళ్లింది.

Prabhas: “రాజు ఏ పరిస్థితిలో ఉన్నా రాజే”.. ప్రభాస్ ని పొగుడుతున్న నెటిజెన్లు!

తన తల్లికోసం పిల్ల గుర్రం పరుగు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో పిల్ల గుర్రం తన తల్లి ఆచూకీకోసం చేసిన ప్రయత్నంను చూసి నెటిజన్లు ఆవేదనకు గురిచేసింది. అయ్యో పాపం.. పిల్ల గుర్రానికి ఎంత కష్టమొచ్చింది.. తన తల్లి ఆచూకీ దొరికేలా చూడు దేవుడా అంటూ పలువురు నెటిజన్లు రీ ట్వీట్లు చేస్తున్నారు.