Groom Friends: వింత కోరిక‌..! పెళ్లికూతురుతో స్టాంప్‌ పేప‌ర్స్ పై సంత‌కం చేయించిన పెళ్లికొడుకు స్నేహితులు.. ప్ర‌తీవారం ఆమె అందుకు ఒప్పుకోవాలంట‌ ..

స్నేహితుల పెళ్లి జ‌రుగుతుంటే మ‌నం ఏం చేస్తాం.? మ‌న స్థాయికి త‌గ్గ‌ట్లుగా వ‌ధూవ‌రుల‌కు ఓ గిఫ్ట్ ఇస్తాం. కొంత‌మంది స్నేహితులు ఆశ్చ‌ర్య‌ప‌ర్చేలా బ‌హుమ‌తులు అందిస్తారు. అయితే తాజాగా ఓ పెళ్లిలో పెళ్లికొడుకు స్నేహితులు పెళ్లికూతురుతో స్టాంప్ పేప‌ర్స్ పై సంత‌కం చేయించారు. ఈ పేప‌ర్స్ లో రాసిన విష‌యాన్ని చూసి పెళ్లికూతురు ముసిముసి న‌వ్వులు న‌వ్వుకుంటూ సంత‌కం చేసింది.

Groom Friends: వింత కోరిక‌..! పెళ్లికూతురుతో స్టాంప్‌ పేప‌ర్స్ పై సంత‌కం చేయించిన పెళ్లికొడుకు స్నేహితులు.. ప్ర‌తీవారం ఆమె అందుకు ఒప్పుకోవాలంట‌ ..

Groom Friends

Groom Friends: స్నేహితుల పెళ్లి జ‌రుగుతుంటే మ‌నం ఏం చేస్తాం.? మ‌న స్థాయికి త‌గ్గ‌ట్లుగా వ‌ధూవ‌రుల‌కు ఓ గిఫ్ట్ ఇస్తాం. కొంత‌మంది స్నేహితులు ఆశ్చ‌ర్య‌ప‌ర్చేలా బ‌హుమ‌తులు అందిస్తారు. అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో అవి వైర‌ల్ గా మారుతుంటాయి. తాజాగా ఓ పెళ్లిలో పెళ్లికొడుకు స్నేహితులు పెళ్లికూతుర్ని వింత కోరిక కోరారు. అంతేకాదు.. ఆమె మాట త‌ప్ప‌కుండా రూ. 20 స్టాప్ పేప‌ర్స్‌పై సంత‌కాలుసైతం చేయించారు. వీరి వింత‌కోరిక‌ను మ‌న్నించి పెళ్లికూతురుసైతం ముసిముసి న‌వ్వుల‌తో సంత‌కం చేసింది. ఇంత‌కీ పెళ్లికొడుకు స్నేహితులు కోరిన ఆ వింత కోరిక ఏమిటంటే..

Bear Viral video: కారు డోరు తెరిచి లోపలికి వెళ్ళిన ఎలుగు బంటి.. వీడియో వైరల్

త‌మిళ‌నాడు రాష్ట్రం తేనిలో ఓ ప్రైవేట్ కాలేజీలో హ‌రిప్ర‌సాద్ ప్రొఫెస‌ర్ గా ప‌నిచేస్తున్నాడు. అత‌డికి పూజ అనే యువ‌తితో పెళ్లి నిశ్చ‌య‌మైంది. ఇటీవ‌ల వారి పెళ్లి జ‌రుగుతున్న క్ర‌మంలో హ‌రిప్ర‌సాద్ స్నేహితులుసైతం హాజ‌ర‌య్యారు. అయితే పెళ్లి తంతు ముగిసిన త‌రువాత బంధువులు వారికి బహుమ‌తులు అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ క్ర‌మంలో హ‌రిప్ర‌సాద్ స్నేహితులు పెళ్లి మండ‌పంపైకి వెళ్లి రూ. 20 స్టాంప్ పేప‌ర్స్ బ‌య‌ట‌కు తీశారు. వాటిని ఓ ఫైల్ గా చేసి పెళ్లికూతురికి అందించి సంత‌కం చేయ‌మ‌ని కోరారు. పెళ్లికూతురు ఆశ్చ‌ర్యంగా వాటిని తీసుకుంది. తీరా స్టాంప్ పేప‌ర్స్‌లో వాళ్లు రాసిన అస‌లు విష‌యం చ‌దివి న‌వ్వు ఆపుకోలేక‌పోయింది. వారి కోరిక‌ను మ‌న్నిస్తూ సంత‌కం చేసింది.

Vijayasai Reddy : తగ్గేదేలే అంటున్న విజయసాయిరెడ్డి.. ‘పుష్ప’పై స్పెషల్ ట్వీట్..

పెళ్లికొడుకు హ‌రిప్ర‌సాద్ సూప‌ర్ స్టార్ క్రికెట్ జ‌ట్టుకు కెప్టెన్. స్నేహితుల‌తో క‌లిసి ప్ర‌తీ శ‌ని, ఆదివారాల్లో క్రికెట్ ఆడుతుంటాడు. అయితే, పెళ్లైన త‌రువాత మ‌గ‌వాళ్లు భార్య ప్రేమ‌లోప‌డి స్నేహితుల‌ను మ‌ర్చిపోవ‌టం సాధార‌ణం. అలాకాకుండా.. హ‌రిప్ర‌సాద్ ప్ర‌తీ శ‌ని, ఆదివారాల్లో క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు అనుమ‌తిని కోరుతూ పెళ్లికూతురుతో మామూలు కాగితాల‌పై కాకుండా ఏకంగా స్టాంప్ పేప‌ర్స్ పై సంత‌కం చేయించారు. ఈ స్టాంప్ పేప‌ర్స్ పై పెళ్లికూతురు పూజ‌.. నేను నా భ‌ర్త‌ను క్రికెట్ ఆడేందుకు అనుమ‌తిస్తాను అంటూ రాసి సంత‌కం చేసింది. దీంతో హ‌రిప్ర‌సాద్ స్నేహితులు సంతోషం వ్య‌క్తం చేశారు. అనంత‌రం ఆ స్టాంప్ పేప‌ర్స్ ప‌ట్టుకొని వ‌రుడు, వ‌ధువుతో ఫొటోలు దిగారు. పెళ్లికి వ‌చ్చిన బంధువులు పెళ్లికొడుకు స్నేహితుల వింత కోరిక తెలుసుకొని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.