230 kmph: షాకింగ్ వీడియో.. కారు వేగం 230 కి.మీ.. బీఎండబ్ల్యూ కారు ప్రమాద ఘటనలో సంచలన వీడియో విడుదల

అతివేగం ప్రాణాంతకం అనేందుకు మరో ఉదాహరణ ఈ ఘటన. ఇటీవల బీఎండబ్ల్యూ కారులోని నలుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనకు ముందు వారు తీసుకున్న వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. అందులో కారు ప్రయాణిస్తున్న వేగం చూసి నెటిజన్లు షాకవుతున్నారు.

230 kmph: షాకింగ్ వీడియో.. కారు వేగం 230 కి.మీ.. బీఎండబ్ల్యూ కారు ప్రమాద ఘటనలో సంచలన వీడియో విడుదల

230 kmph: అతివేగం ప్రమాదకరం, ప్రాణాంతకం అని తెలిసినా కొందరు పట్టించుకోరు. బైకులు, కార్లు వేగంగా నడిపి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లో పూర్వాంచల్ రహదారిపై ఒక బీఎండబ్ల్యూ కారు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Pawan Kalyan: జనసేన కార్యకర్తలపై కేసులు అక్రమం.. గొడవలు వైసీపీ పనే: పవన్ కల్యాణ్

ప్రమాద సమయంలో కారు ఇంజిన్ తుక్కుతుక్కుకాగా, మృతదేహాలు దూరంగా ఎగిరిపడ్డాయి. అక్కడి ప్రమాద దృశ్యాన్ని చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి తాజాగా ఒక సంచలన వీడియో విడుదలైంది. ఘటన జరిగి, ప్రాణాలు కోల్పోవడానికి కొద్దిసేపటి ముందు కారులోని వ్యక్తులు ఫేస్‌బుక్ లైవ్‌లో ఒక వీడియో టెలికాస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను, పోలీసుల్ని షాక్‌కు గురి చేస్తోంది. వీడియో ప్రకారం… బీఎండబ్ల్యూ కారులో నలుగురు ప్రయాణిస్తున్నారు. వారు సరదాగా కారు అత్యంత వేగంగా నడపాలనుకున్నారు. డ్రైవర్ కారు వేగం పెంచితే, మిగతావాళ్లు ప్రోత్సహించారు. కారు వేగం గంటకు 300 కిలోమీటర్లు అందుకోవాలని డ్రైవర్‌ను రెచ్చగొట్టారు. దీంతో డ్రైవర్ కూడా మరింత రెచ్చిపోయి.. హైవేపై కారును ఇంకా వేగంగా నడిపాడు.

Girl Child Died: ఏడాదిన్నర చిన్నారిని వదిలేసి బయటకు వెళ్లిన తల్లి.. నీళ్ల బకెట్‌‌లో పడి పాప మృతి

అలా కారు దాదాపు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించింది. దాదాపు ఇదే వేగంతో కారు చాలా దూరం వెళ్లింది. ఈ సమయంలో కారులోని ఒక వ్యక్తి.. ఇదే వేగంతో వెళ్తే నలుగురం చనిపోతామేమో అనే సందేహం వ్యక్తం చేశాడు. అయినా, కారు వేగం ఎక్కడా తగ్గకుండా ముందుకు వెళ్తూనే ఉంది. వీడియో ముగిసే సమయానికి కారు వేగం గంటకు 230 కిలోమీటర్ల వేగంతో వెళ్లిందంటే వారు ఏ స్థాయి వేగంతో ప్రయాణించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫేస్‌బుక్ లైవ్‌ ఆగిపోయింది. తర్వాత కొద్దిసేపటికే హైవేపై ట్రక్కును కారు ఢీకొంది. దీంతో కారులోని నలుగురు అక్కడికక్కడే మరణించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.