Girl Child Died: ఏడాదిన్నర చిన్నారిని వదిలేసి బయటకు వెళ్లిన తల్లి.. నీళ్ల బకెట్‌‌లో పడి పాప మృతి

పద్దెనిమిది నెలల చిన్నారిని ఇంట్లోనే వదిలేసి బయటకు వెళ్లింది ఆమె తల్లి. తిరిగొచ్చేసరికి చిన్నారి నీళ్ల బకెట్‌లో పడిపోయి ఉంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చిన్నారి మరణించిందని చెప్పారు వైద్యులు.

Girl Child Died: ఏడాదిన్నర చిన్నారిని వదిలేసి బయటకు వెళ్లిన తల్లి.. నీళ్ల బకెట్‌‌లో పడి పాప మృతి

Updated On : October 17, 2022 / 5:38 PM IST

Girl Child Died: తమిళనాడులోని చెన్నైలో దారుణం జరిగింది. నిండుగా ఉన్న బకెట్ నీళ్లలో పడి 18 నెలల చిన్నారి పాప ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన చెన్నై, పూనామలి పోలీస్ స్టేషన్ పరిధిలోని, పారివక్కం పరిధిలో శనివారం జరిగింది.

Nama Nageshwar Rao: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావుకు ఈడీ షాక్.. రూ.80.65 కోట్ల ఆస్తులు జప్తు

రాహుల్ కుమార్, చంద్రిక దంపతులకు ఏడాదిన్నర వయసున్న పాప ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వీళ్లు స్థానికంగా కూలి పని చేసుకుంటూ, ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో బాలిక తండ్రి రాహుల్ పని కోసం బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో పాప, తల్లి మాత్రమే ఉన్నారు. అయితే, తల్లి చంద్రిక కూడా పాపను ఒంటరిగా వదిలేసి ఇంటి పక్కనే బయటకు వెళ్లింది. చంద్రిక తిరిగొచ్చేసరికి పాప బకెట్ నీళ్లలో పడి పోయి స్పృహ తప్పిపోయి ఉంది. వెంటనే తల్లి, స్థానికుల సహకారంతో ఆస్పత్రికి తరలించింది.

Deepavali 2022: దీపావళి ఆ రోజే.. స్పష్టం చేస్తున్న పండితులు

అయితే, అప్పటికే పాప మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టమ్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.