Deepavali 2022: దీపావళి ఆ రోజే.. స్పష్టం చేస్తున్న పండితులు

ఈ ఏడాది దీపావళి ఏ రోజు నిర్వహించుకోవాలి అనే విషయంలో చాలా మందికి సందేహాలున్నాయి. 24 లేక 25.. రెండిట్లో ఏ రోజు దీపావళి అనే విషయంలో స్పష్టమైన సూచన చేస్తున్నారు పండితులు. వారు చెప్పిన వివరాల ప్రకారం..

Deepavali 2022: దీపావళి ఆ రోజే.. స్పష్టం చేస్తున్న పండితులు

Deepavali 2022: రాబోయే దీపావళి ఎప్పుడు నిర్వహించుకోవాలి అనే విషయంలో చాలా మందిలో సందేహాలున్నాయి. క్యాలెండర్ ప్రకారం ఈ నెల 25నే దీపావళి అని కొందరు నమ్ముతున్నారు. మరికొందరు మాత్రం 24న దీపావళి జరుపుకోవాలని సూచిస్తున్నారు. అయితే, ఈ విషయంలో పండితులు ఒక స్పష్టమైన సూచన చేస్తున్నారు.

Miranda House: మిరండా హౌజ్‌లోకి చొచ్చుకొచ్చిన ఆకతాయిలు.. అమ్మాయిలపై వేధింపులు.. స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్

పంచాంగం ప్రకారం ఈ నెల 24న దీపావళి జరుపుకోవాలి అని సూచిస్తున్నారు. సాధారణంగా అశ్వయుజ మాసం, బహుళ అమావాస్య రోజున దీపావళి జరుపుకోవడం ఆనవాయితీ. ఇది క్యాలెండర్ ప్రకారం ఈ నెల 25న వస్తోంది. దీంతో 25, మంగళవారం దీపావళి అనుకుంటున్నారు చాలా మంది. కానీ, పండితులు మాత్రం 24న జరుపుకోవాలి అని చెబుతున్నారు. దీనికి కారణం ఉంది. దీపావళి వేడుకల్ని ప్రదోష వేళలో నిర్వహిస్తారు. అంటే సూర్యాస్తమయం తర్వాత.. చీకటి పడ్డాక దీపావళి జరుపుతారు. దీని ప్రకారం 25, మంగళవారం అమావాస్య రోజు చీకటి పడేసరికి పాడ్యమి ఘడియలు వస్తున్నాయి. అంటే 25, సాయంత్రం 4.25 నిమిషాలకల్లా అమావాస్య ముగిసి పాడ్యమి వస్తుంది. మంగళవారం సూర్యాస్తమయం అయ్యే సమయానికి అమావాస్య పోతుంది.

Nama Nageshwar Rao: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావుకు ఈడీ షాక్.. రూ.80.65 కోట్ల ఆస్తులు జప్తు

అందువల్ల సోమవారమే దీపావళి జరుపుకోవాలి అంటున్నారు. సోమవారం సాయంత్రం 4.25 గంటలకు అమావాస్య ప్రారంభమవుతుంది. అంటే సోమవారం రోజే అమావాస్య ఘడియలు ఉంటాయి. కాబట్టి, ఆ రోజే దీపావళి నిర్వహించుకోవడం ఉత్తమం అని పండితులు చెబుతున్నారు. క్యాలెండర్ ప్రకారం మంగళవారం అమావాస్య ఉన్నప్పటికీ, ఆ రోజు సాయంత్రానికి అమావాస్య ఘడియలు ముగిసిపోతున్న కారణంగా సోమవారమే దీపావళి అని సూచిస్తున్నారు. అలాగే దీపావళి సోమవారం నిర్వహించుకోవడానికి, గ్రహణానికి కూడా సంబంధం లేదంటున్నారు. మంగళవారం గ్రహణం ఉండటం వల్లే దీపావళిని సోమవారానికి మార్చారు అనడం సరికాదని పండితులు సూచిస్తున్నారు. అమావాస్య ఘడియను అనుసరించి మాత్రమే 24, సోమవారం దీపావళి నిర్వహించుకోవాలని సూచిస్తున్నట్లు పేర్కొన్నారు.