Airtel Free Netflix Plan : ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్.. 84 రోజుల వ్యాలిడిటీతో ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

ఈ ప్లాన్ కింద అన్‌లిమిటెడ్ 5జీ డేటా, ఇతర బెనిఫిట్స్‌తో కూడిన స్పెషల్ ఎంటర్‌టైన్మెంట్ ప్లాన్లను అందిస్తోంది.

Airtel Free Netflix Plan : ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్.. 84 రోజుల వ్యాలిడిటీతో ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Airtel free Netflix Basic plan (Image Source : Google )

Airtel Free Netflix Plan : ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ కోసం వెతుకుతున్నారా? నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌పై నిషేధం విధించిన క్రమంలో అదనంగా చెల్లించకుండానే ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌ను పొందవచ్చు. భారతీ ఎయిర్‌టెల్ ప్రస్తుతం ప్రీపెయిడ్ మొబైల్ యూజర్ల కోసం ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ కింద అన్‌లిమిటెడ్ 5జీ డేటా, ఇతర బెనిఫిట్స్‌తో కూడిన స్పెషల్ ఎంటర్‌టైన్మెంట్ ప్లాన్లను అందిస్తోంది. ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్‌ను అందించే నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌ను వివరంగా పరిశీలిద్దాం.

Read Also : Apple iPhone 16 : ఫిజికల్ బటన్ డిజైన్ లేకుండానే ఆపిల్ ఐఫోన్ 16 వచ్చేస్తోంది.. లేటెస్ట్ లీక్ డేటా వెల్లడి!

ఎయిర్‌టెల్ రూ. 1499 ప్లాన్ వివరాలు :
రూ. 1,499 ప్రీపెయిడ్ ప్లాన్ 3జీబీ రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌తో కూడిన ఫుల్ ప్యాకేజీని అందిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల పాటు వ్యాలిడిటీనిఅందిస్తుంది. అదనంగా, ఎయిర్‌టెల్ కాంప్లిమెంటరీ నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్ మూవీలు, టీవీ షోల లైబ్రరీకి యాక్సెస్‌ను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ యూజర్లు 5జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ 5జీ డేటా యాక్సెస్‌ను కూడా పొందవచ్చు. వేగవంతమైన ఇంటర్నెట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ ప్లాన్‌లో అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్, ఫ్రీ హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ యాక్సెస్ వంటి ఇతర పెర్క్‌లు ఉన్నాయి. ఆసక్తికరంగా, నెట్‌ఫ్లిక్స్ ఇకపై తన ప్రైమరీ ప్లాన్‌ని నేరుగా నెట్‌ఫ్లిక్స్ ద్వారా కొత్త సబ్‌స్క్రైబర్‌లకు అందించదు. అయితే, ఎయిర్‌‌టెల్ యూజర్లు ఈ ప్లాన్‌ను పొందవచ్చు.

బడ్జెట్-ఫ్రెండ్లీ ధరకు (SD) క్వాలిటీలో మూవీలు, టీవీ షోల లైబ్రరీకి యాక్సస్ పొందవచ్చు. ఈ ప్లాన్ ఒక సమయంలో ఒక డివైజ్‌లో మాత్రమే స్ట్రీమింగ్ చేసేందుకు అనుమతిస్తుంది. వ్యక్తిగత యూజర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. అత్యధిక రిజల్యూషన్ లేదా అకౌంట్ షేరింగ్ చేసే సామర్థ్యాన్ని అందించనప్పటికీ, అనేక రకాల ఎంటర్‌టైన్మెంట్ కంటెంట్‌ను పొందాలంటే కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పనే. అయినప్పటికీ, ఎయిర్‌టెల్ రూ. 1,499 ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే.. ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌ను ఈజీగా పొందవచ్చు.

నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను ఎలా పొందాలంటే? :

  • ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ని ఓపెన్ చేసి ‘డిస్కవర్ థాంక్స్ బెనిఫిట్స్’ సెక్షన్ నావిగేట్ చేయండి.
  • నెట్‌ఫ్లిక్స్ బెనిఫిట్స్ కోసం చూడండి.
  • కొనసాగడానికి ‘Cliam’ బటన్‌పై ట్యాప్ చేయండి. సూచనలను ఫాలో అవ్వండి.
  • యాక్టివేషన్ ప్రాసెస్‌ని కొనసాగించండి.
  • నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ మీ మొబైల్ నంబర్‌కి లింక్ అవుతుంది.
  • నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం 84 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు.
  • ఎయిర్‌టెల్ పాలసీ ప్రకారం.. కస్టమర్ నెట్‌ఫ్లిక్స్-అర్హత గల రీఛార్జ్‌ ఉన్నంతవరకు ప్లాన్ వ్యాలిడిటీ కొనసాగుతుంది.

ఎయిర్‌టెల్ ప్రధాన పోటీదారు అయిన రిలయన్స్ జియో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌లతో ప్రీపెయిడ్ ప్లాన్‌లను కూడా అందిస్తోంది. జియో రూ. 1,099 ప్లాన్ మొబైల్ యూజర్లకు 2జీబీ రోజువారీ డేటా, 84-రోజుల వ్యాలిడిటీతో అందిస్తుంది. అయితే, రూ. 1,499 ప్లాన్ పెద్ద వ్యూకు సరిపోతుంది. సపోర్టు డివైజ్‌లలో అన్‌లిమిటెడ్ 5జీ ఇంటర్నెట్‌ను అందిస్తుంది. రెండు జియో ప్లాన్‌లలో ప్రాథమిక నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే, ఎయిర్‌టెల్ నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌ను వేరుగా అందిస్తుంది.

Read Also : WhatsApp iPhone Users : వాట్సాప్ ఐఫోన్ యూజర్లు ఇకపై పాస్‌వర్డ్ లేకుండానే లాగిన్ చేయొచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!