Prabhas : ముంబై, కోల్‌కతాల మధ్య మహా యుద్ధం.. భైరవగా ప్రభాస్ లుక్ అదుర్స్..
భైరవ లుక్‌లో ఐపీఎల్‌లో భాగంగా మే 3న ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుందని అని ప్రభాస్ చెప్పాడు.

Kalki 2898 AD Prabhas Bhairava new video for IPL 2024
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘కల్కి 2898AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2024 జూన్ 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విడుదల కానుంది. లోక నాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకోన్, దిశాపటాని లతో పాటు టాలీవుడ్ స్టార్ నటుడు రానాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్విని దత్ దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే అమితాబ్ బచ్చన్‌కు సంబంధించిన సర్‌ప్రైజ్‌ను ఇచ్చి ఆశ్చర్యపరిచింది చిత్ర బృందం. ప్రభాస్ బైరవ పాత్రకు సంబంధించిన సడెన్ సర్‌ప్రైజ్ ఉంటుందని ఉదయం నుంచి సోషల్ మీడియాలో చెబుతూ వచ్చింది చిత్ర బృందం. అన్నట్లుగా స్టార్‌స్పోర్ట్స్ ఛానెల్‌లో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా మధ్యలో ప్రభాస్ కనిపించాడు.
SS Rajamouli : క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి.. ‘బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేటెడ్ సిరీస్..
అది కూడా భైరవ లుక్‌లో ఐపీఎల్‌లో భాగంగా మే 3న ముంబై ఇండియన్స్, కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుందని అని ప్రభాస్ చెప్పాడు. ఇది కూడా ఓ యుద్ధం లాంటిదేనన్నాడు. కాగా.. ఈ వీడియోలో ప్రభాస్ లుక్ చూసి ఫ్యాన్స్ పుల్ ఖుషీ అవుతున్నారు. అతడి హెయిర్ స్ట్రైల్, గడ్డం, మొత్తంగా లుక్ అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
? ????? #BHAIRAVA ???? ???? ?? ?????? #Prabhas ❤️??#Kalki2898AD pic.twitter.com/bTKGhlDjbk
— Kalki 2898AD FC (@Kalki2898AD_FC) April 30, 2024
కాగా.. భైరవ ఆశ్చర్యపరిచాడా? అంటూ కాసేపటి తరువాత వైజంతి మూవీస్ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.
Geetha Bhagat : ఈ యాంకర్ గురించి తెలుసా? సుమక్క లాగే పద్దతిగా దూసుకుపోతూ..
Did our Bhairava surprise you? How many of you have seen it? #KalKeLiyeAajKhelo #Kalki2898AD #Prabhas @starsportsindia
— Kalki 2898 AD (@Kalki2898AD) April 30, 2024