AP CRDA Notification: ఏపీ సీఆర్డీయేలో జాబ్స్.. నెలకు రూ.1.96 లక్షల జీతం.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(AP CRDA Notification) మేనేజర్‌, ఇంజినీర్‌, తదితర పోస్టుల నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

AP CRDA Notification: ఏపీ సీఆర్డీయేలో జాబ్స్.. నెలకు రూ.1.96 లక్షల జీతం.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు

AP CRDA Notification: APCRDA Vijayawada has released a notification for 8 posts.

Updated On : September 6, 2025 / 7:30 AM IST

AP CRDA Notification: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (AP CRDA Notification) గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ CRDAలో ఖాళీగా ఉన్న మేనేజర్‌, ఇంజినీర్‌, డిజైన్‌, కాంట్రాక్ట్‌, క్వాలిటీ ఎక్స్‌పర్ట్‌ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పూర్తిగా ఒప్పంద ప్రాతిపదికన జరగనున్న ఈ నియామకాల కోసం దరఖాస్తులి కోరుతోంది. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 5వ తేదీన మొదలై సెప్టెంబర్ 19వ తేదీతో ముగియనుంది. కాబట్టి.. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా crda.ap.gov.in ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

IIT JAM 2026: మొదలైన ఐఐటీ జామ్ 2026 అప్లికేషన్స్.. ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు వివరాలు

పోస్టులు, ఖాళీల వివరాలు:

* ప్లానింగ్ మేనేజర్‌ (PMU) పోస్టులు 01

* ప్లానింగ్ ఇంజినీర్‌ (PMU) పోస్టులు 04

* సీనియర్‌ కాంట్రాక్ట్స్‌ ఎక్స్‌పర్ట్‌ పోస్టులు 01

* సీనియర్‌ డిజైన్‌ ఎక్స్‌పర్ట్‌ పోస్టులు 01

* సీనియర్‌ క్వాలిటీ ఎక్స్‌పర్ట్‌ పోస్టులు 01

విద్యార్థలు:
అభ్యర్థులు వివిధ పోస్టులకు సంబంధించి బీటెక్‌/బీఈ, ఎంఈ/ఎంటెక్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆలాగే తగిన అనుభవం కూడా తప్పనిసరి.

వేతన వివరాలు:

* ప్లానింగ్ మేనేజర్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.1,40,000 జీతం ఇస్తారు.

* ప్లానింగ్ ఇంజినీర్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.1,00,000 జీతం ఇస్తారు.

* సీనియర్‌ కాంట్రాక్ట్స్‌ ఎక్స్‌పర్ట్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.1,96,000 జీతం ఇస్తారు.

* సీనియర్‌ డిజైన్‌ ఎక్స్‌పర్ట్‌, సీనియర్‌ క్వాలిటీ ఎక్స్‌పర్ట్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.1,60,000 జీతం ఇస్తారు.

పనిచేయు ప్రదేశము:
ఏపీ సీఆర్‌డీఏ, విజయవాడ – అమరావతి.