IIT JAM 2026: మొదలైన ఐఐటీ జామ్ 2026 అప్లికేషన్స్.. ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు వివరాలు

ఐఐటీ(IIT JAM 2026) బాంబే మాస్టర్స్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జామ్​ దరఖాస్తు ప్రక్రియపై అధికారిక ప్రకటన చేసింది.

IIT JAM 2026: మొదలైన ఐఐటీ జామ్ 2026 అప్లికేషన్స్..  ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు వివరాలు

IIT JAM 2026 application process begins

Updated On : September 6, 2025 / 6:59 AM IST

IIT JAM 2026: ఐఐటీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) బాంబే మాస్టర్స్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జామ్​ (IIT JAM 2026) 2026 దరఖాస్తు ప్రక్రియపై అధికారిక ప్రకటన చేసింది. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 5న మొదలయ్యింది. ఈ ప్రక్రియ అక్టోబర్ 12వరకు కొనసాగనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్ ఐటీ jam2026.iitb.ac.in నుంచి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇక ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఐఐటీ జామ్ 2026 పరీక్ష 2026 ఫిబ్రవరి 15న జరుగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 21 ఐఐటీలతో పాటు ఇతర విద్యాసంస్థల్లో దాదాపు 3,000 కంటే ఎక్కువ సీట్లను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు అధికారలు.

Indian Army Jobs: ఎన్‌సీసీ అభ్యర్థులకు ఆర్మీ జాబ్స్.. నెలకు రూ.56 వేల జీతం.. దరఖాస్తు ఇలా చేసుకోండి

ఐఐటీ జామ్ 2026 ముఖ్యమైన తేదీలు ఇవే:

* సెప్టెంబర్ 5: దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

* అక్టోబర్ 12: దరఖాస్తుకు చివరి తేదీ

* జనవరి 5, 2026: అడ్మిట్ కార్డు విడుదల

* ఫిబ్రవరి 15, 2026: పరీక్ష తేదీ

* మార్చి 20, 2026: ఫలితాల ప్రకటన

ఐఐటీ జామ్ 2026 దరఖాస్తు ఇలా చేసుకోండి:

* అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ jam2026.iitb.ac.in లోకి వెళ్ళాలి

* ఇమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోవాలి.

* తరువాత ఈ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.

* వ్యక్తిగత, విద్యా వివరాలను ఎంటర్ చేయాలి

* కావాల్సిన పరీక్ష పేపర్‌ను, పరీక్షా కేంద్రాలను ఎంచుకోవాలి.

* అవసరమైన పాత్రల స్కాన్ కాపీలను, సంతకం అప్‌లోడ్ చేయాలి.

* ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

* భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్/సేవ్ చేసుకోవాలి.