Railway Jobs: పది పాసైన వారికి రైల్వేలో జాబ్స్.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు

క్రీడలలో ప్రతిభ కనబరిచిన వారికి ఈస్టర్న్ రైల్వే (RRC ER) గ్రూప్ C, గ్రూప్ D పోస్టులను భర్తీ చేసేందుకు(Railway Jobs) నోటిఫికేషన్ విడుదల చేశారు.

Railway Jobs: పది పాసైన వారికి రైల్వేలో జాబ్స్.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు

Railway Jobs: Eastern Railway to fill 50 posts under sports quota

Updated On : September 6, 2025 / 8:21 AM IST

Railway Jobs: భారత రైల్వేలో ఉద్యోగం కోసం చేస్తున్నారా? అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. క్రీడలలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ఈస్టర్న్ రైల్వే (RRC ER) అవకాశాలు కలిపిస్తోంది. స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ C, గ్రూప్ D పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల(Railway Jobs) చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబందించిన దరఖాస్తు సెప్టెంబర్ 10 నుంచి మెదలుకానుంది. ఈ ప్రక్రియ అక్టోబర్ 9వ తేదీ వరకు కొనసాగనుంది. కాబట్టి.. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ rrcer.org నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

AP CRDA Notification: ఏపీ సీఆర్డీయేలో జాబ్స్.. నెలకు రూ.1.96 లక్షల జీతం.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు

పోస్టులు, ఖాళీల వివరాలు:

* గ్రూప్ C (Level-4/5) పోస్టులు 05
* గ్రూప్ C (Level-2/3) పోస్టులు 12
* గ్రూప్ D (Level-1) పోస్టులు 33

వయోపరిమితి:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 01.01.2026 నాటికి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

విద్యార్హతలు:

* Level-4/5 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అబ్యర్ధులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
* Level-2/3 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అబ్యర్ధులు 10, 12వ తరగతి + ITI/ ఆప్రాన్టిస్షిప్ కలిగి ఉండాలి.
* Level-1 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అబ్యర్ధులు 10వ తరగతి/ ITI/NAC పూర్తి చేసి ఉండాలి.

క్రీడా అర్హతలు:

* Level-4/5 పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఒలింపిక్ గేమ్స్‌లో దేశాన్ని ప్రాతినిధ్యం వహించాలి/ ప్రపంచ స్థాయి టోర్నమెంట్స్‌లో 3వ స్థానం సాధించి ఉండాలి.

* Level-2/3 పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఆసియా/కామన్‌వెల్త్ గేమ్స్‌లో పాల్గొని ఉండాలి/ జాతీయ స్థాయిలో 1వ/3వ స్థానం సాధించి ఉండాలి.

* Level-1 పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు రాష్ట్ర స్థాయి/ సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్స్‌లో కనీసం 8వ స్థానం సాధించి ఉండాలి.

వేతన వివరాలు:

* ఈ పోస్టులకు ఎంపికైన వారికి 7వ CPC ప్రకారం:

* Level-1 వారికి గ్రేడ్ పే రూ.1800

* Level-2/3 వారికి గ్రేడ్ పే రూ.1900 నుంచి 2000

* Level-4/5 వారికి గ్రేడ్ పే రూ.2400 నుంచి 2800 వరకు ఉంటుంది.

అదనంగా డియర్నెస్ అలవెన్స్ (DA), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ (TA), పెన్షన్ (NPS), ఉచిత రైలు పాస్‌లు, మెడికల్ సదుపాయాలు కూడా అందుతాయి.

ఎంపిక ప్రక్రియ:

* ఈ పోస్టులకు మొత్తం మూడు విభాగాల్లో ఎంపిక జరుగుతుంది.

* మొదటిది క్రీడా ట్రయల్స్: ఇందులో అభ్యర్థుల క్రీడా నైపుణ్యం, ఫిట్‌నెస్ అంచనా వేస్తారు.

* రెండవది అర్హతల ఆధారంగా మార్కులు: ఇందులో అభ్యర్థుల స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్, ఎడ్యుకేషన్, ట్రయల్స్ చేస్తారు.

* మూడవది డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది.